ఆదిలాబాద్‌టౌన్: టీబీ రహిత సమాజానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్ అన్నారు. వంద రోజుల టీబీ, నిక్షయ్ శివిర్ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని జిల్లా జైలులో ఖైదీలకు టీబీపై శనివారం అవగాహన కల్పించారు. పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు అందజేశారు. ఏజెన్సీ ప్రాంతం నుంచి జైలుకు వచ్చిన ఖైదీలకు సికిల్‌సెల్, మధుమేహ పరీక్షలు జరిపారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడు తూ, వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో జైలు సూపరింటెండెంట్ అశోక్ కుమార్, జిల్లా టీబీ నియంత్రణ అధికారి సుమలత, ఎన్‌సీడీ ప్రోగ్రాం అధికారి శ్రీధర్, వైద్యులు సాయిప్రియ, సయ్యద్ అన్సారి, డిప్యూటీ జైలర్ రాథోడ్ కృష్ణ, ట్రెయినీ డిప్యూటీ జైలర్ ప్రేమ్ కుమార్, జైలు వైద్యులు ఫాతిమా, సిబ్బంది పాల్గొన్నారు.
‘నాల్గో తరగతి’ సంఘ వ్యవహారాలపై విచారణ
కై లాస్‌నగర్: తెలంగాణ నాల్గో తరగతి తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా శాఖ వ్యవహారాలు, ఆర్థికపరమైన అంశాలపై విచారణ జరిపించేందు కోసం సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని నియమించారు. ఈ కమిటీ సభ్యులు దాసరి నాయక్, రామస్వామి, భిక్షమయ్య శనివారం జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. స్థానిక సంఘ భవనంలో సంఘ బాధ్యులు, నాల్గో తరగతి ఉద్యోగులతో సమావేశం నిర్వహించి ఆయా అంశాలపై ఆరా తీశారు. కాగా అన్ని శాఖల్లోని అటెండర్ల సభ్యత్వాన్ని నమోదు చేయాలని, మడిగెల అద్దె పేపర్ ప్రకటన, లీజు వ్యవహారాలు రద్దు చేయాలని కోరుతూ పలువురు ఉద్యోగులు వారికి వినతిపత్రం అందజేశారు. జిల్లా కార్యవర్గ ఎన్నికలను జేఏసీకి అప్పగించాలని, అధ్యక్ష పదవీకి రాజీనామా చేసిన వ్యక్తి అధ్యక్షుడి హోదాలో ఎలాంటి సమావేశాలు నిర్వహించకుండా చూడాలని కోరారు. కాగా, విచారణ కమిటీ నివేదికను సంఘం రాష్ట్ర అధ్యక్షుడికి అందజేస్తామని వారు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment