● అర్హులందరికీ సంక్షేమ పథకాలు
నూతన సంవత్సరంలో జిల్లా ప్రజలంతా ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాం. యువత, విద్యార్థులు సన్మార్గంలో ముందుకు సాగాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులందరికీ చేరేలా కృషి చేస్తాం. ఏజెన్సీ ప్రాంతాల్లో రక్తహీనతను అధిగమించేలా అంగన్‌వాడీలు, ప్రభుత్వ పాఠశాలల్లో 85 న్యూట్రిషియన్ గార్డెన్లు ఏర్పాటు చేశాం. ఈ ఏడాది వాటి సంఖ్య మరింత పెంచుతాం. విద్యార్థుల ఆరోగ్యం కాపాడేలా త్వరలోనే వైద్య శిబిరాలు ప్రారంభిస్తాం. రైతులకు విత్తన, ఎరువుల కొరత రాకుండా ప్రత్యేక శ్రద్ధ వహిస్తాం. స్వయం సహాయ క సంఘాల మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు ఆన్‌లైన్ మా ర్కెటింగ్ సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకుంటాం. మహిళా శక్తిని పకడ్బందీగా అమలు చేస్తాం. సీఎస్‌ఆర్ నిధులతో పీవీ టీజీ, ఆదివాసీ గ్రామాల్లోని ప్రజల సంక్షేమానికి చర్యలు తీసుకుంటాం. ఆరోగ్య పాఠశాల, కళాశాల కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నాం. దీన్ని యూపీఎస్‌లకు విస్తరిస్తాం. ఈ ఏడాది డీఎస్సీతో పాటు వివిధ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెలువడే అవకాశమున్నందున యువత సమయం వృథా చేయకుండా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలి. ఇందిరమ్మ ఇళ్ల సర్వే పారదర్శకంగా సాగుతుంది. నిబంధనల మేరకు అర్హులైన వారికి ఇళ్లు మంజూరు చేస్తాం. – రాజర్షి షా, కలెక్టర్
Comments
Please login to add a commentAdd a comment