● అన్ని గ్రామాలకు రోడ్లు..
బోథ్ నియోజకవర్గంలోని ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నా. అన్ని గ్రామాలకు రోడ్లు, మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నా. రూ.150 కోట్లతో గతేడాది అభివృద్ధి పనులు చేపట్టాం. 30 చొప్పున పంచాయతీ, అంగన్‌వాడీ కేంద్రాల భవనా లను నిర్మించాం. ఇచ్చోడ, కరంజి, బండల్‌నాగాపూర్, కప్పర్ల, రాజురా గ్రామాల్లో రోడ్ల నిర్మాణం పూర్తయింది. కొత్తగా సిరిచెల్మ నుంచి పెంబి, ఇచ్చోడ నుంచి కేస్లాపూర్, అడెల్లి రోడ్డు నిర్మించేలా చర్యలు చేపడుతున్నాం. గ్రామాల్లో త్రీఫేజ్ కరెంట్, బ్రిడ్జి నిర్మాణాలు, కొత్త చెరువులు, ప్రాజెక్టులు నిర్మించేలా చర్యలు చేపడుతున్నా. బరంపూర్, సిరిచెల్మ, కై లాస్ టేక్డి ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తా. కొత్త మండలం సొనాల అభివృద్ధికి చర్యలు చేపడతా. నిరుద్యోగులకు ఉపాధి కల్పించేలా చూస్తా. అందరి సహకా రంతో నియోజకవర్గ అభివృద్ధి కోసం ముందుకు సాగుతా. – జాదవ్ అనిల్‌కుమార్, బోథ్ ఎమ్మెల్యే
Comments
Please login to add a commentAdd a comment