సివిల్ సప్లయ్ హమాలీల సమ్మె
కై లాస్‌నగర్: కూలి రేట్ల ఒప్పంద జీవో వెంటనే జారీ చేయాలని డిమాండ్ చేస్తూ సివిల్ సప్లయ్ హమాలీ కార్మికులు సమ్మెకు దిగా రు. జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో గల ఎంఎల్‌ఎస్ పాయింట్ గోడౌన్ ఎదుట చేపట్టిన సమ్మెను ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్.విలాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి సిర్ర దేవేందర్ కార్మికులకు పూల మాలలు వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వా రు మాట్లాడుతూ, గతంలో సివిల్ సప్లయి హమాలీలతో రాష్ట్ర కమిషనర్ ఒప్పుకున్న రెట్ల ఒప్పంద జీవో వెంటనే విడుదల చేసి 01.01.2024 నుంచి అమలు చేసి ఏరియర్స్‌తో కలిపి ఇవ్వాలని కోరారు. అలాగే హమాలీ కార్మికులకు స్వీపర్లకు రూ.10 లక్షల ఆరోగ్య బీమా సౌకర్యం వెంటనే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా డిప్యుటీ ప్రధాన కార్యదర్శి గాజంగుల రాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment