వాతావరణం పొడిగా ఉంటుంది. తేమశాతం పెరగనుంది. వేకువజామున పొగమంచు ప్రభావం కనిపించనుంది.
గోవింద నామస్మరణతో భక్తజనం పులకించిపోయారు. శ్రీనివాసుని కల్యాణోత్సవాన్ని వీక్షించి తన్మయత్వం చెందారు. జిల్లాకేంద్రంలోని డైట్ కళాశాల మైదానంలో కొనసాగుతున్న 85వ ఆయు త మహాచండీ యాగంలో భాగంగా శనివారం శ్రీ భూనీలావేంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ కల్యాణ ఘట్టాన్ని వైభవోపేతంగా నిర్వహించగా తిలకించేందుకు భక్తజనం భారీగా తరలివచ్చారు. ఇందులో కృష్ణ జ్యోతి స్వరూపానందస్వామి, ఆధ్యాత్మికవేత్తలు, పలువురు రాజకీయ నాయకులు పాల్గొన్నారు. – ఆదిలాబాద్
Comments
Please login to add a commentAdd a comment