టీషర్ట్‌లు అందజేసి.. బెస్టఫ్ లక్ చెప్పి
కై లాస్‌నగర్: సీఎం కప్–2024లో భాగంగా రెండో విడత జిల్లా స్థాయి పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులు ఈ నెల 29, 30వ తేదీల్లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. వీరంతా హైదరాబాద్, మహబూబ్‌నగర్, మెదక్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, హన్మకొండ జిల్లాలకు ఆది వారం ప్రత్యేక బస్సుల్లో బయలుదేరి వెళ్లనున్నారు. ఈ మేరకు శనివారం జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో యూనిఫాం టీ షర్ట్‌లను కలెక్టర్ అందజేసి వారికి బెస్ట్ ఆఫ్ లక్ తెలిపారు. రాష్ట్ర స్థాయి క్రీడల్లోనూ రాణించి జిల్లా పేరు నిలబెట్టా లని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డీవైఎస్‌వో వెంకటేశ్వర్లు, గిరిజన క్రీడల అధికారి పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment