మహిళా సమాఖ్య భవనం సిద్ధం
కైలాస్నగర్: పదేళ్ల క్రితం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరై అసంపూర్తిగా నిలిచిన జిల్లా మహిళా సమాఖ్య భవనం దుస్థితిపై ‘మహిళాశక్తిపై నిర్లక్ష్యమేలా?’ శీర్షికన గతేడాది నవంబర్ 19న ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. స్పందించిన కలెక్టర్ రాజర్షి షా అవసరమైన నిధులతో కూడిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
వారి నివేదిక ఆధారంగా తుది మరమ్మతు పనుల కోసం కలెక్టర్ రూ.10లక్షలు మంజూరు చేశారు. పనులు సైతం పూర్తయ్యాయి. ప్రస్తుతం అన్ని హంగులతో సిద్ధమైన ఈ భవనాన్ని మంత్రి సీతక్క చేతుల మీదుగా సోమవారం ప్రారంభించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment