చింతపల్లి: గిరిజన రైతులు ఆంధ్రప్రదేశ్ రైతు రిజిస్ట్రీలో తమ వివరాలను నమోదు చేసుకోవడం ద్వారా మేలు కలుగుతుందని వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు అన్నారు. లోతుగెడ్డ,కుడుముసారి,కొలపరి గ్రామాల్లో రైతులకు అవగహన కార్యక్రమాలను నిర్వహించారు.ఈ రిజిస్ట్రీ కార్యక్రమం ఈ నెల 26 నుంచి ప్రతి రైతు సేవా కేంద్రంలో ప్రారంభమవుతుందని తెలిపారు.ఈ కార్యక్రమానికి రైతులు ఆధార్ కార్డుతో పాటు అనుసంధానమైన ఫోన్ నంబరు,జిరాయితీ పట్టా,రేషన్ కార్డు ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కొమ్మంగి సర్పంచ్ లక్ష్మి వైఎస్సార్‌సీనియర్ నాయకులు గుణబాబు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment