రాష్ట్రం సుభిక్షం
జగన్ పాలనలోనే
● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు
● ఘనంగా పార్టీ అధినేత
జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలు
● పేదలకు రగ్గులు, పిల్లలకు స్కూల్ బ్యాగ్‌లు, రోగులకు రొట్టెల పంపిణీ
● జిల్లావ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేపట్టిన పార్టీ శ్రేణులు, అభిమానులు
పాడేరు: రాష్ట్రంలో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పాలనలో అన్నివర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేవారని, నేడు కూటమి ప్రభుత్వ హయాంలో ఆ పరిస్థితి లేకుండా పోయిందని పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు విమర్శించారు. శనివారం ఆయన అధ్యక్షతన పాడేరులో జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా స్థానిక మోదకొండమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం మండలంలోని కుజ్జెలి పంచాయతీ ఇసుకలు గ్రామంలో స్థానిక గిరిజనులతో కలిసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ కేక్‌ను కట్ చేశారు. ఇసుకలు, చీడిమెట్ట గ్రామాల గిరిజనులకు రగ్గులు పంపిణీ చేశారు. గిరిజన సంప్రదాయ థింసా నృత్యాలతో సందడి చేశారు. అనంతరం వంతాడపల్లి బీవీకే పాఠశాలలలో అనాధ పిల్లలకు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు రగ్గులు, స్కూల్ బ్యాగ్‌లు పంపిణీచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం చేసేందుకు ప్రతిఒక్కరూ కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు సీదరి రాంబాబు, వైఎస్సార్‌సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు కూడా సురేష్‌కుమార్, కిల్లు కోటిబాబు నాయుడు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సీదరి మంగ్లన్నదొర, మహిళ విభాగం జిల్లా అధ్యక్షురాలు కురుసా పార్వతమ్మ, మండల సర్పంచ్‌ల పోరం అధ్యక్షుడు వనుగు బసవన్నదొర, సర్పంచ్ గబ్బాడ చిట్టిబాబు, ఎంపీటీసీ కుంతూరు నర్సింహమూర్తి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కూతంగి సూరిబాబు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.
అరకులోయ టౌన్: సంక్షేమ పథకాల ప్రదాత వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి అని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. శనివారం ఆయన అధ్యక్షతన అరకులో జగన్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. దివంగత సీఎం వైఎస్ కాంస్య విగ్రహానికి ఎమ్మెల్యేతోపాటు ఎమ్మెల్సీ కుంభా రవిబాబు, ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర, పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఎగురవేశారు. బాణసంచా కాల్చి, కేక్ కట్ చేసి వేడకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మత్స్యలింగం మాట్లాడుతూ రాబోయే రోజుల్లో జగనన్నను మళ్లీ సీఎంను చేసేందుకు కార్యకర్తలు, నాయకులు కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు.ఎమ్మెల్సీ డాక్టర్ కుంభా రవిబాబు మాట్లాడుతూ దేశంలో ఏ ప్రభుత్వం చేయనివిధంగా ప్రజలకు సంక్షేమ పాలన అందించారన్నారు. గిరిజన ప్రాంత ప్రజలు, నాయకులు ఎప్పుడూ ఆయన వెంట ఉంటారన్నారు. మళ్లీ సీఎంను చేసేందుకు అదివాసీ బిడ్డలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వం లేని లోటు ఈ ఆరు నెలల్లో స్పష్టంగా కనిపించిందన్నారు.వైఎస్సార్‌సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షురాలు కొట్టగుళ్లి బాగ్యలక్ష్మి మాట్లాడుతూ గత ఐదేళ్లలో సుపరిపాలన అందించిన జగనన్న ప్రభుత్వానికి, ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి ఎంతో వ్యత్యాసం ఉందన్నారు. ఎన్నికల హామీనలు విస్మరించి అరాచక పాలన సాగిస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో రోగులకు రొట్టెలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అరకులోయ, అనంతగిరి, డుంబ్రిగుడ ఎంపీపీలు ఉషారాణి, నీలవేణి, ఈశ్వరి, డుంబ్రిగుడ జెడ్పీటీసీ జానకమ్మ, ఎంపీటీసీలు ఎల్‌బీ భీమరాజు, శత్రుఘ్న, ఆనంద్‌కుమార్, సింహాచలం, సుశీల, సర్పంచ్‌లు సుష్మిత, బుటికి, ఎం. జ్యోతి, భాస్కర్‌రావు, రాధిక, జీనబందు, పూర్ణిమ, వైస్ ఎంపీపీలు కిల్లో రామన్న, ఆనంద్, జయవర్దన్, వైఎస్సార్‌సీపీ మేధావుల వింగ్ జిల్లా అధ్యక్షుడు రాజరమేష్ బోష్, పార్టీ రాష్ట్ర ఎస్టీ సెల్ కార్యదర్శులు జర్శింగి సూర్యనారాయణ, పాంగి చిన్నారావు, సంయుక్త కార్యదర్శి నర్సింహ మూర్తి, పార్టీ మండల అధ్యక్షులు లక్ష్మణ్‌కుమార్, మల్లేశ్వరరావు, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కిరణ్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు నర్సింగరావు పాల్గొన్నారు.
జగనన్న పాలనలోనే సంక్షేమం
రంపచోడవరం: వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో పేదలకు అనేక సంక్షేమ పథకాలు అందాయని రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి అన్నారు. పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జన్మదిన వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక అంబేడ్కర్ సెంటర్‌లో వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేశారు. పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం స్థానిక ఏరియా ఆస్పత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ అధికారంలో ఉన్నప్పుడు మన్యంలో అనేక అభివృద్ధి పనులు జరిగాయన్నారు. గిరిజనులకు కార్పొరేట్ స్ధాయిలో వైద్య సేవలు అందించేందుకు రంపచోడవరంలో మల్టీపర్పస్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి తీసుకువచ్చి, నిర్మాణం ప్రారంభించిన ఘనత తమ పార్టీకి దక్కుతుందన్నారు. కొత్త పీహెచ్‌సీలు ఏర్పాటుతో గిరిజనులకు వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చామన్నారు. గిరిజనుల గుండెల్లో వైఎస్సార్ సీపీ ఎప్పుడు పదిలంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బందం శ్రీదేవి, వైస్ ఎంపీపీ పండా కుమారి, సర్పంచ్ మంగా బొజ్జయ్య, పార్టీ మండల కన్వీనర్ జల్లేపల్లి రామన్నదొర, ఎంపీటీసీలు ఉలవల లక్ష్మి, వంశీ కుంజం, సర్పంచ్ మిర్తివాడ ఆనంద్‌రెడ్డి, ఉప సర్పంచ్ వీఎం కన్నబాబు, సీతపల్లి బాపనమ్మ దేవస్థానం మాజీ చైర్మన్ బొబ్బా శేఖర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment