విద్యార్థికి అభినందనలు
యలమంచిలి రూరల్: అంతర్జాతీయ బ్యాడ్మింటెన్ పోటీల్లో యలమంచిలి గురజాడ అప్పారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థి ఎస్.హేమచంద్రన్ కాంస్య పతకం సాధించి ప్రతిభ కనబరిచాడు. గత నెల 23 నుంచి 26 వరకు నేపాల్ ఖాట్మాండ్ కవర్డ్ హాల్‌లో యెనెక్స్ సన్‌రైజ్ నేపాల్ ఇంటర్నేషనల్ ఛాలెంజ్ బీడబ్ల్యూఎఫ్ 2024 పోటీల్లో బాలుర డబుల్స్ విభాగంలో భారత్ తరఫున పోటీల్లో పాల్గొన్న హేమచంద్రన్ సత్తా చాటాడు. కాంస్య పతకం సాధించడంపై కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.చంద్రశేఖర్, ఫిజికల్ డైరెక్టర్ వై.పోలిరెడ్డి గురువారం అభినందించారు. హేమచంద్రన్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని వారు ఆకాంక్షించారు. కళాశాలలో బీఏ మొదటి సంవత్సరం చదువుతున్న హేమచంద్రన్ బ్యాడ్మింటన్‌లో శిక్షణ నిమిత్తం విశాఖపట్నంలో కోచ్ వద్దకు వెళ్లినట్టు వారు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment