చిన్నారులకు బాక్సింగ్‌లో తర్ఫీదు
బాక్సింగ్‌లో తర్ఫీదు పొందుతున్న చిన్నారులు
నర్సీపట్నం : స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఎన్‌ఐఎస్ కోచ్‌గా సర్టిఫికెట్ సాధించిన బాక్సింగ్ క్రీడాకారిణి వేపాడ ప్రియాంక చిన్నారులకు బాక్సింగ్‌లో తర్ఫీదు ఇస్తున్నారు. మున్సిపాలిటీ పెదబొడ్డేపల్లి ఆర్‌సీఎం స్కూల్ గ్రౌండ్‌లో వుషూ, బాక్సింగ్, కరాటే, యోగాలో శిక్షణ ఇస్తున్నారు. నర్సీపట్నం రాలేని చిన్నారులు ఆర్‌సీఎం గ్రౌండ్‌లో తర్ఫీదు పొందవచ్చనని ప్రియాంక పేర్కొన్నారు. ముఖ్యంగా బాలికలు, అమ్మాయిలకు సెల్ఫ్ ప్రొటెక్షన్ టెక్నిక్‌లలో ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు. రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో రాణించేలా విద్యార్థులకు తర్పీదు ఇస్తున్నామని, ఈ అవకశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment