కాఫీలో నాణ్యమైనదిగుబడులు సాధించాలి
● కలెక్టర్ దినేష్‌కుమార్
● రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచన
చింతపల్లి: మన్యంలో కాఫీ దిగుబడుల పెంపుతోపాటు నాణ్యతపెంపుపై రైతులు దృష్టిసారించాలని కలెక్టర్ దినేష్‌కుమార్ సూచించారు. గురువారం ఆయన చింతపల్లిలో పర్యటించారు. కాఫీరైతు ఉత్పత్తిదారుల సంఘం మాక్స్ ఆధ్వర్యంలో నడుస్తున్న కాఫీ ఎకో పల్పింగ్ పరిశ్రమను సందర్శించారు. రైతులు తీసుకువస్తున్న కాఫీ పండ్ల నాణ్యతను పరిశీలించారు. పల్పింగ్ కేంద్రంలో జరుగుతున్న ప్రాసెసింగ్ విధానాన్ని తెలుసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment