ఆదివాసీలకోసం పోరాడే వారినే ఎన్నుకోండి
● ఏపీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్
అరకులోయ టౌన్: ఈనెల 3,4 తేదీల్లో ప్రభుత్వం గ్రామ సభల ద్వారా నిర్వహించనున్న పీసా ఎన్నికల్లో ఆదివాసీల చట్టాలు, హక్కు ల రక్షణకై పోరాడే అభ్యర్థులను మాత్రమే ఎన్నుకోవాలని ఏపీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ ఒక ప్రకటనలో కోరారు. ప్రభుత్వం పీసా కమిటీ ఉపాధ్యక్షుడు, కార్యదర్శి స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తోందన్నారు. ఆదివాసీల చట్టాలు, హక్కుల రక్షణపై పోరాడే వారు లేకపోవడం వల్ల అవి నిర్వీర్యం అవుతున్నాయన్నారు. ఈ పరిస్థితుల్లో చట్టాలు, హక్కులపై అవగాహన ఉన్నవారిని మాత్రమే ఎన్నుకుంటే ఆదివాసీలుకు న్యాయం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment