దత్తత మీ ఇష్టం..! | - | Sakshi
Sakshi News home page

దత్తత మీ ఇష్టం..!

Published Fri, Jan 17 2025 12:46 AM | Last Updated on Fri, Jan 17 2025 12:45 AM

దత్తత

దత్తత మీ ఇష్టం..!

జంతు ప్రపంచం...

ఆరిలోవ : ఇందిరాగాంధీ జూ పార్కులో వన్యప్రాణులను జూ అధికారులు దత్తత ఇస్తున్నారు. ఇందుకు దాతలు కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. దాతల పేరుతో జూ సిబ్బంది వాటికి ఆహారం అందిస్తారు. జూలో ఏ జంతువు, ఏ పక్షిని దత్తత తీసుకుంటే వాటి ఎన్‌క్లోజరు వద్ద వాటి ఫొటోతో పాటు దాతల పేర్లతో బోర్డులు ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం పలువురు దాతల పేర్లతో కూడిన బోర్డులను వారు దత్తత తీసుకున్న వన్యప్రాణుల ఎన్‌క్లోజర్ల వద్ద ఏర్పాటు చేశారు.

ఆకర్షణీయంగా దాతల పేర్లతో బోర్డులు

జూ పార్కులో వివిధ జాతులకు చెందిన జంతువులు, రకరకాల పక్షులు, తాబేళ్లు, మొసళ్లు, పాములు సందర్శకులను అలరిస్తుంటాయి. వాటిపై దాతలు ప్రేమ, వాత్సల్యం చూపుతూ జూ అధికారులకు సహకరిస్తున్నారు. వాటిని దత్తత తీసుకుని నెలకు, ఆరు నెలలకు, సంవత్సరానికి ఆహారం అందించడానికి కొంత మొత్తం చెల్లిస్తున్నారు. ఇక్కడ తెల్ల పులి, ఖఢ్గమృగం, జిరాఫీ తదితర పెద్ద జంతువులను పలు కంపెనీలు ఏడాది పాటు దత్తత తీసుకున్నాయి.

● ఫ్లూయంట్‌ గ్రిడ్‌ లిమిటెడ్‌ జిరాఫీని ఒక ఏడాది పాటు దత్తత తీసుకుంది.

● ఐవోసీఎల్‌ కంపెనీ ఖఢ్గమృగాన్ని ఏడాది కాలం దత్తత తీసుకుంది. మరో ఏడాది దత్తత కొనసాగించడానికి ఇటీవలే ఆ కంపెనీ ముందుకు వచ్చింది.

● ఆర్సెలర్‌ మిట్టల్‌ నిప్పన్‌ స్టీల్‌ ఇండియా లిమిటెడ్‌ తెల్ల పులిని ఏడాది పాటు దత్తత తీసుకుంది.

● చిన్న జంతువులు, పక్షులను కొందరు నెల, ఆరు నెలలు పాటు దత్తత తీసుకొని ఆహారం అందిస్తున్నారు. ఆయా ఎన్‌క్లోజర్ల వద్ద దాతల బోర్డులు కూడా ఆకర్షణగా నిలుస్తున్నాయి.

ఆహారం ఇలా...

సింహం, పులికి పశు మాంసం, చికెన్‌ ఆహారంగా వేస్తున్నారు. ఏనుగుకు రాగి సంగటి, చెరకు, గ్రాసం, అరటి దవ్వ, బెల్లం, కొబ్బరి కాయలు అందిస్తున్నారు. చింపాంజీలకు పళ్లు, కాయలు, పాలు ఆహారంగా వేస్తారు. జింకలు, కనుుజులు, కొండ గొర్రెలు తదితర వాటికి గ్రాసం వేస్తారు. అన్ని పక్షులకు పలు రకాల పళ్లు ముక్కలు కోసి వేస్తారు. కోతులకు పళ్లు, వేరుశనగ పిక్కలు అందిస్తారు. నీటి ఏనుగుకు పళ్లు, కూరగాయలు, ఆకు కూరలు వేస్తారు. ఇలా ఇక్కడ వన్యప్రాణులన్నింటికీ వాటి ఆహారం కోసం రోజుకు రూ.లక్షల్లో ఖర్చు చేస్తున్నారు.

ఆదాయం పన్ను మినహాయింపు..

ఇక్కడ వన్యప్రాణులను దత్తత తీసుకోవడానికి వ్యక్తులు, సంఘాలు, పరిశ్రమలు వారి శక్తి మేరకు సహకారం అందించవచ్చు. ఏనుగు నుంచి చిన్న పక్షి వరకు ఎవరైనా ఎంత కాలానికై నా దత్తత తీసుకోవచ్చు. వాటి కోసం ఒక రోజు, నెల, ఏడాది వారిగా అయ్యే ఖర్చు చెల్లించవచ్చు. జూలో వన్యప్రాణులను దత్తత తీసుకున్నవారికి ఆదాయం పన్నులో మినహాయింపు ఉంటుందని అధికారులు ప్రకటించారు. ఈ దత్తత పద్ధతి 2011లో ప్రారంభించారు. అప్పటి నుంచి పలువురు దాతలు ముందుకొచ్చి ఇక్కడ పులులు, సింహాలు, ఏనుగులు, పక్షులకు ఆహారం అందిస్తున్నారు.

ఎంత మొత్తం చెల్లించాలంటే..

జంతువు / పక్షి దత్తతకు చెల్లించాల్సిన మొత్తం

జంతువు/ పక్షి రోజుకు ఏడాదికి

ఏనుగు రూ.1200 రూ.4,30,000

ఖడ్గమృగం రూ.820 రూ.3,00,000

నీటి ఏనుగు రూ.600 రూ. 2,00,000

సింహం రూ.600 రూ.1,90,000

పెద్ద పులి రూ.600 రూ.1,90,000

జిరాఫీ రూ.500 రూ.1,80,000

చిరుత పులి రూ.400 రూ.1,25,000

ఎలుగుబంటి రూ.300 రూ.1,10,000

చింపాంజీ రూ.210 రూ.75,000

అడవి దున్న రూ.200 రూ.73,000

జీబ్రా రెండింటికి రూ.330 రూ.60,000

(ఒక జీబ్రాకు)

తోడేళ్లు రెండింటికి రూ.300 రూ.55,000

(ఒక తోడేలుకు)

రేచుకుక్క రూ.135 రూ.50,000

చుక్కల దుప్పి రూ.100 రూ.36,500

రింగ్‌టైల్డ్‌ లెమూర్‌కు రూ.100 రూ.36,500

ఇవి కాకుండా...

మొసలి/ఘరియల్‌

రెండింటికి రోజుకు రూ.150 రూ.24,000

హంసలు (రెండింటికి (ఏడాదికి ఒకదానికి)

2 రోజులకు) రూ.100 రూ.18,000

నక్షత్ర తాబేళ్లు (పదింటికి (ఒక హంస)

ఐదు రోజులకు) రూ.150 రూ.11,000

సారస్‌ కొంగ/నిప్పుకోడి/ పాములు

(నాలుగు రోజులకు) రూ.100 రూ.10,000

(ఒకదానికి)

గుడ్లగూబలు (నాలుగింటికి రూ.100 రూ.9,500

ఒకరోజుకు ) (ఒక దానికి)

మకావ్‌లు (నాలుగింటికి

మూడు రోజులకు) రూ.100 రూ.3,000

(ఒక దానికి)

పీజియన్‌/నెమళ్లు (నాలుగింటికి

నాలుగు రోజులకు) రూ.100 రూ.2,200 (ఒక దానికి)

ఆఫ్రికన్‌ చిలుకలు/రామచిలుకలు

(ఐదు రోజులకు) రూ.100 రూ.1500

(ఒకదానికి)

లవ్‌ బర్డ్స్‌ (పదింటికి

ఐదు రోజులకు) రూ.100 రూ.1,000

(ఒకదానికి)

దాతలు ముందుకు రావాలి

జూలో వన్యప్రాణులను దత్తత తీసుకోవడానికి దాతలు ముందుకు రావాలి. వాటికి ఆహారం అందించడంలో భాగస్వాములు కావాలి. ఇప్పటికే కొందరు దాతలు సంస్థల పరంగా, వ్యక్తిగతంగా ముందుకు వచ్చి కొన్ని జంతువులను, పక్షులను వారం, నెల, ఏడాది కాలానికి ఆహారం అందించడానికి వన్యప్రాణులను దత్తత తీసుకొన్నారు. ఎక్కువమంది దాతలు స్పందించి ఇక్కడ వన్యప్రాణులను దత్తత తీసుకోవడానికి ముందుకు వస్తే మూగజీవాలకు సహకరించినవారవుతారు. దాతలకు ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుంది.

– జి.మంగమ్మ, జూ క్యూరేటర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
దత్తత మీ ఇష్టం..!1
1/7

దత్తత మీ ఇష్టం..!

దత్తత మీ ఇష్టం..!2
2/7

దత్తత మీ ఇష్టం..!

దత్తత మీ ఇష్టం..!3
3/7

దత్తత మీ ఇష్టం..!

దత్తత మీ ఇష్టం..!4
4/7

దత్తత మీ ఇష్టం..!

దత్తత మీ ఇష్టం..!5
5/7

దత్తత మీ ఇష్టం..!

దత్తత మీ ఇష్టం..!6
6/7

దత్తత మీ ఇష్టం..!

దత్తత మీ ఇష్టం..!7
7/7

దత్తత మీ ఇష్టం..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement