అలరించిన సీ విజిల్ విన్యాసాలు
వివిధ తీరాల్లో సీ విజిల్ విన్యాసాలు
సాక్షి, విశాఖపట్నం : తీర ప్రాంతంపై భారత రక్షణ దళం పట్టుని ప్రదర్శించేందుకు ఏటా నిర్వహిస్తున్న సీవిజిల్–2024 ఘనంగా ముగిసింది. రెండు రోజుల పాటు భారత నౌకాదళం నేతృత్వంలో సీవిజిల్–2024 పేరుతో యుద్ధ విన్యాసాలు జరిగాయి. సముద్ర తీర రేఖ కలిగి ఉన్న ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పశ్చిమబెంగాల్, ఒడిశా, పుదుచ్ఛేరి సహా 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ విన్యాసాలు విజయవంతంగా నిర్వహించారు. మొత్తం 6 మంత్రిత్వ శాఖలు, 21 విభాగాలు, ఏజెన్సీలు ఈ విన్యాసాల్లో భాగస్వామ్యమయ్యాయి. మత్స్యకారుల రూపంలో ఉగ్రమూకల చొరబాటు, చేపల వేటకు వెళ్లి సరిహద్దులు దాటిన జాలర్లను సురక్షితంగా తీసుకురావడం, ఆకస్మిక దాడుల్ని సమర్థవంతంగా ఎదుర్కోవడం.. ఇలా.. భిన్నమైన విన్యాసాలతో అలరించారు.
Comments
Please login to add a commentAdd a comment