●అతివలపై ఆగడాలు.. ఎన్నాళ్లీ అఘాయిత్యాలు ?
న్యాయ విద్యార్థినిపై జరిగిన అత్యాచార ఘటనను నిరసిస్తూ ఎస్‌ఎఫ్‌ఐ, ఐద్వా ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు. వందలాది మంది విద్యార్థులతో ర్యాలీ జరిపి అబిద్‌సెంటర్‌లో మానవహారంగా ఏర్పడి నినాదాలు చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ డివిజన్ కార్యదర్శి జనార్దన్ మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. రాజకీయ ఒత్తిడులకు తలొగ్గి అధికారులు చట్టాలకు తూట్లు పొడుస్తున్నారన్నారు. దాడులకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ధర్నాలో డీవైఎఫ్‌ఐ డివిజన్ అధ్యక్షుడు గౌతమ్, ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు ఎల్.గౌరి తదితరులు పాల్గొన్నారు. – నర్సీపట్నం
నర్సీపట్నం అబిద్‌సెంటర్‌లో విద్యార్థుల మానవహారం
Comments
Please login to add a commentAdd a comment