అక్రమ టాక్స్ వసూళ్లపై పోలీసులకు ఫిర్యాదు
నర్సీపట్నం: మున్సిపాలిటీలో అక్రమంగా టాక్స్ వసూలు చేస్తున్న అపరిచితులపై మున్సిపల్ కమిషనర్ జంపా సురేంద్ర టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన అందించిన వివరాలు.. సైబర్ నేరాల తరహాలోనే అపరిచితులు కొంతమంది వ్యాపారులకు ఫోన్ చేసి.. తాము మున్సిపల్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నామని, టాక్స్ డబ్బులు వెంటనే ఫోన్‌పే చేయా లని డిమాండ్ చేస్తున్నారు. అపరిచితుడి మాటలు నమ్మి ఒక వ్యాపారి రూ.1600లు ఫోన్‌పే చేశారన్నారు. అపరిచితుడి ఫోన్ నంబరుకు ట్రూ కాలర్‌లో ‘మున్సిపల్ కమిషనర్’ అని రావడంతో కొంతమంది వ్యాపారులు నిజమని నమ్మి, సొమ్ము చెల్లించారన్నారు. తన దృష్టికి తేవడంతో అపరిచితుడి నంబరుకు ఫోన్ చేయగా.. రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయటం లేదన్నారు. వెంటనే టౌన్ సీఐ గోవిందరావును కలిసి ఫిర్యాదు చేశామన్నారు. తను కానీ తమ సిబ్బంది కానీ ఎవరికీ టాక్స్ కట్టమని ఫోన్లు చేయలేదన్నారు. సైబర్ తరహాలో కొత్త నేరానికి తెరలేపారన్నారు. టాక్స్, వ్యాపార లైసెన్సులు, లైసెన్సుల రెన్యూవల్, ఇతర టాక్స్‌లు నేరుగా కార్యాలయానికి చెల్లించి రసీదు తీసుకోవాలని కమిషనర్ స్పష్టం చేశారు.
● మున్సిపల్ సిబ్బంది పేరిట ప్రజలకు ఫోన్లు
Comments
Please login to add a commentAdd a comment