సమస్యలు తీర్చని సదస్సులెందుకు?
బుచ్చెయ్యపేట: రైతుల సమస్యలు పరిష్కరించనప్పుడు రెవెన్యూ సదస్సులెందుకంటూ వడ్డాది గ్రామస్తులు కన్నెర్ర చేశారు. గురువారం గ్రామంలో తహసీల్దార్ ఎం.లక్ష్మి నిర్వహించిన సదస్సులో అధికారుల తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ జిరాయితీ భూములను ఇనాం భూములుగా రికార్డు చేశారని, ఈ కారణంగా క్రయవిక్రయాల్లో తీవ్ర అవస్థల పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలోని వడ్డాది వేంకటేశ్వరస్వామి భూముల సర్వే నంబర్‌లో దేవదాయ భూములతో కలపి జిరాయితీ భూములను చేర్చిన కారణంగా ఇబ్బందులు పడుతున్నామన్నారు. అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఫలితం లేదని వాపోయారు. రెవెన్యూ అధికారులు మామూళ్లకు అలవాటు పడి రికార్డులను తారుమారు చేశారని దుయ్యబట్టారు. వడ్డాది వెంకన్న దేవదాయ భూములకు సంబంధించి ఇప్పటికీ సరైన రికార్డులు లేవని ఆరోపించారు. ఈ వ్యవహారాలన్నింటినీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని తహసీల్దార్ లక్ష్మి వారికి హామీ ఇచ్చారు.
వడ్డాది సభలో రైతుల ఆగ్రహం
Comments
Please login to add a commentAdd a comment