బుచ్చింపేట పాఠశాలలో ‘ప్రైవేటు’ బోధన
● బయోమెట్రిక్ వేసుకుని వెళ్లిపోతున్న హెచ్‌ఎం
రోలుగుంట: మండలంలోని బుచ్చింపేట ఎంపీపీ పాఠశాలలో విద్యార్థులకు ప్రైవేటు వ్యక్తి బోధించడం విస్మయానికి గురి చేస్తోంది. ఇక్కడ పని చేస్తున్న హెచ్‌ఎం యు.నాగభూషణం రోజూ ఉదయం 9 గంటలకు రావడం, ఆనక బయోమెట్రిక్ వేసుకుని బయటకు వెళ్లిపోతున్నారు. విషయం తెలిసిన విద్యార్థుల తల్లిదండ్రులు హెచ్‌ఎంని నిలదీసినా ప్రయోజనం లేకపోయింది. దీంతో ఎంఈవోకి, ఆ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఎంఈవో జానుప్రసాద్‌ను సాక్షి సంప్రదించగా, గత నెలలో అతనికి మెమో ఇచ్చామన్నారు. దీనిపై హెచ్‌ఎం తనకు, తన భార్యకు ఆరోగ్యం బాగుండడం లేదని సమాధానమివ్వగా మందలించామన్నారు. తాను ప్రైవేటు వ్యక్తితో బోధనకు అనుమతించలేదన్నారు. శుక్రవారం నుంచి పూర్తిస్థాయిలో విధులు నిర్వహించాలని ఆదేశించానన్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదిస్తానని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment