నమ్మించి మోసగించారు
● వైస్ చైర్మన్ పేరుమార్పుపై దిబ్బపాలెం ఎంపీటీసీ పెద్దినాయుడు, మార్లగుమ్మి చానల్ అధ్యక్షుడు మండిలు ఆవేదన
చీడికాడ : రాత్రికి రాత్రి ఉపాధ్యక్షుని పేరుమార్చి ఇప్పటివరకు ఎప్పుడూ ప్రస్తావనకు రాని పేరు ప్రకటించారంటూ మండలంలోని దిబ్బపాలెం ఎంపీటీసీ దారపు పెద్దినాయుడు, దిబ్బపాలెం మార్లగుమ్మిఛానల్ అధ్యక్షుడు దారపు మండిలు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఎంపీడీవో సమావేశ మందిరంలో కోనాం జలాశయం చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కోసం ఆర్‌డీఓతో పాటు ఇరిగేషన్ అధికారులు, నూతనంగా ఎన్నికై న నీటిసంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు. ఆర్‌డీఓ చైర్మన్, వైస్ చైర్మన్ పేర్లను ప్రకటించి నియామక పత్రాలు అందించారు. దీంతో అక్కడే ఉన్న పెద్దినాయుడు మాట్లాడుతూ వైస్ చైర్మన్‌గా దారపు మండీలు పేరు కాకుండా కొట్యాడ చిన్నంనాయుడును ఎలా నియమించారని అక్కడే ఉన్న నాయకులను ప్రశ్నించారు. ఇప్పటి వరకు చిన్నంనాయుడు పేరు ఎవరూ ప్రస్తావించలేదని రాత్రికి,రాత్రి సంతకాలు చేసి మమల్ని మోసగించి మండలపార్టీ నేతలు, ఎమ్మెల్యే కలిసి అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. పలువురు నేతలు వీరిని సముదాయించేందుకు ప్రయత్నించినా వారు ఆగ్రహంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment