ఆయుష్మాన్ కేంద్రాల్లో నాణ్యమైన సేవలందాలి
● పాటిపల్లి కేంద్రంలో ఢిల్లీ బృందం తనిఖీ
మునగపాక : పాటిపల్లి ఆయుష్మాన్ ఆరోగ్యమందిర్‌ను శనివారం ఢిల్లీ బృందం సందర్శించింది. నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్ (ఎన్‌క్యూఏఎస్) టీమ్‌కు చెందిన డాక్టర్ గణేష్ నాగిరెడ్డి అదికి, రేజ్ కుమార్‌లు మునగపాక ఉపకేంద్రమైన పాటిపల్లిలో సందర్శించి ప్రజలకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. ఈ కేంద్రం ద్వారా సేవల్లో నాణ్యతను నిర్ధారించడం అలాగే మెరుగుపరచడం వంటి అంశాలపై ఈ సంస్థ పనిచేస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసే వివిధ జాతీయ కార్యక్రమాల అమలు తీరు అడిగి తెలుసుకున్నారు. జాతీయ ఆరోగ్య మిషన్ పథకంలో భాగంగా పలు కేంద్రాలను సందర్శించి ప్రజలకు అందుతున్న సేవలను గుర్తించేందుకు తమ బృందం పర్యటిస్తుందని వారు తెలిపారు. ఆసుపత్రిలో ఏఎన్‌ఎం సుజాత అందిస్తున్న సేవల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. వారి వెంట సర్పంచ్ ఆడారి కృష్ణవేణి, జిల్లా క్వాలిటీ కన్సల్టెంట్ మణికంఠ, డాక్టర్ దుర్గా ప్రవళిక, సీహెచ్‌వో దేవకాంత, ఆశ కార్యకర్తలు సీహెచ్ భవాని, వెంకటలక్ష్మి, అప్పలనర్స, హెచ్‌వీ లక్ష్మి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment