బొమ్మనహాళ్: హెచ్చెల్సీలో కొట్టుకు వచ్చిన మృతదేహం ఆచూకీ లభ్యమైంది. యువకుడిని హత్య చేసి, కాళ్లూచేతులు కట్టేసి హెచ్చెల్సీలో పడేసినట్లుగా పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెలుగు చూసింది. కళ్యాణదుర్గం డీఎస్పీ శ్రీనివాసులు తెలిపిన మేరకు... బొమ్మనహాళ్ మండలం ఉంతకల్లు శివారులోని హెచ్చెల్సీ 119/500 కిలోమీటర్ వద్ద శుక్రవారం ఓ యువకుడి మృతదేహం కొట్టుకు వచ్చిన విషయం తెలిసిందే.
సమాచారం అందుకున్న డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ యుగంధర్, ఎస్‌ఐ శివ... శనివారం ఉదయం అక్కడకు చేరుకుని మృతదేహాన్ని వెలికి తీయించారు. హత్య చేసి కాళ్లు, చేతులు తాడుతో కట్టేసి హెచ్చెల్సీ ప్రధాన కాలువలో పడేసినట్లుగా నిర్ధారించారు. లభ్యమైన ఆధారాలను బట్టి హతుడిని బళ్లారిలోని మేదార్ కేతయ్య నగర్ (ఎమ్‌కే నగర్)కు చెందిన ఎం.వినోజ్ (30)గా గుర్తించారు.
సండూరు వద్ద ఎస్‌ఎండీసీ కంపెనీలో మెకానికల్ ఇంజినీర్‌గా పనిచేస్తుండేవాడు. వివాహేతర సంబంధాల కారణంగానే హత్య చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. వీఆర్వో కుళ్లాయి స్వామి నుంచి స్వీకరించిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment