రాప్తాడు: మండలంలోని బుక్కచెర్ల గ్రామ సమీపంలో నల్లలమ్మ దేవాలయం వెనక కల్లందొడ్డిలో ఈ ఏడాది ఏప్రిల్ 10న జరిగిన హత్య కేసును పోలీసులు శనివారం ఛేదించారు. రాప్తాడు సీఐ టీవీ.శ్రీహర్ష వివరాల మేరకు.. బుక్కచెర్లకు చెందిన జలగాని నల్లపరెడ్డి అల్లుడు బుక్కచెర్ల పురుషోత్తంరెడ్డి వ్యభిచారానికి, మద్యానికి బానిసై హెచ్‌ఐవీ వ్యాధితో బాధపడుతూ ఉండేవాడు. ఊళ్లో కూడా ఇష్టానుసారంగా తిరుగుతూ అందరితో అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. హెచ్‌ఐవీ ఉన్నా ఇంట్లో వాడే అన్ని వస్తువులను వాడుతూ కుటుంబ సభ్యులను కూడా ఇబ్బంది పెట్టేవాడు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 10వ తేదీ మధ్యాహ్నం ఇంట్లో అనారోగ్యంతో బాధపడుతున్న నల్లపరెడ్డి చెల్లెలు అయిన కవితతో పురుషోత్తంరెడ్డి గొడవపడి తీవ్రంగా కొట్టాడు. దీంతో పురుషోత్తంరెడ్డిని ఎలాగైనా చంపాలని మేనమాన నల్లపరెడ్డి పథకం రచించాడు. అదే రోజు సాయంత్రం తమ కల్లందొడ్డి వైపు పురుషోత్తంరెడ్డి వెళ్లగా.. అతని వెంటే నల్లపరెడ్డి కల్లందొడ్డి దగ్గరకు వెళ్లి ఎందుకు రోజూ ఇంట్లో గోడవ పడుతున్నావని ప్రశ్నించాడు. దీంతో పురుషోత్తంరెడ్డి నల్లపరెడ్డి మీదకు వెళ్లాడు. వెంటనే నల్లపరెడ్డి కుడిచెత్తో పురుషోత్తంరెడ్డి చెంపపై బలంగా కొట్టాడు. పురుషోత్తంరెడ్డి పశువుల పాక కోసం నాటిన ఇనుప పైపునకు కొట్టుకుని కింద పడిపోయాడు. పురుషోత్తంరెడ్డి మృతి చెందిన విషయం తెలుసుకున్న నల్లపరెడ్డి వెంటనే పశువుల పాకలోని చీరను మేడకు బిగించి ఉరి వేసుకుని మృతి చెందాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు మొదట అనుమానాస్పద కేసుగా నమోదు చేశారు. నిందితుడైన మేనమామ జలగాని నల్లపరెడ్డిని సీఐ టీవీ శ్రీహర్ష తమదైన శైలిలో విచారించగా నిందితుడు తానే చంపానని ఒప్పుకోవడంతో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. హత్య కేసును ఛేదించిన సిబ్బందిని ఎస్పీ జగదీష్, డీఎస్పీ వెంకటేశ్వర్లు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment