బీసీసీఐ అండర్–23 ఏపీ జట్టులో చోటు
అనంతపురం: బీసీసీఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అండర్–23 అంతర్రాష్ట్ర వన్ డే క్రికెట్ టోర్నీలో ప్రాతినిథ్యం వహిస్తున్న ఏపీ జట్టులో జిల్లాకు చెందిన ఇద్దరికి చోటు దక్కింది. తాడిపత్రికి చెందిన కుడిచేతి మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ టి.మహేంద్రరెడ్డితో పాటు అండర్ –23 ఆంధ్రా ఉమెన్ జట్టుకు ఫిట్నెస్ ట్రైనర్‌గా బి.బొమ్మన్న ఎంపికయ్యారు. జార్ఖండ్ రాజధాని రాంచీలో పురుషుల, జనవరి 4 నుంచి 12వ తేదీ వరకు రాజకోట్‌లో మహిళల క్రికెట్ టోర్నీ నిర్వహించనున్నారు. జట్టులో చోటు దక్కించుకున్న వారిని ఏడీసీఏ సెక్రెటరీ వి.భీమలింగారెడ్డి అభినందించారు.
మినీగోకులం షెడ్ల రద్దు
వజ్రకరూరు: మండలానికి మంజూరైన ఆరు మినీ గోకులం షెడ్లను రద్దు చేసినట్లు ఏపీఓ లక్ష్మీకాంత బాయి తెలిపారు. గురువారం స్థానిక ఉపాధి హామీ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ... వజ్రకరూరు మండలానికి తొలి విడుత కింద మొత్తం 72 మినీ గోకులం షెడ్లు మంజూరయ్యాయన్నారు. ఇందులో ఇప్పటి వరకూ 66 మినీగోకులం షెడ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయన్నారు. మరో ఆరు మినీ గోకులం షెడ్ల నిర్మాణ పనులు ప్రారంభం కాక పోవడంతో వాటిని రద్దు చేసినట్లు వెల్లడించారు. రద్దయిన వాటిలో వజ్రకరూరులో 2, పందికుంటలో 1, వెంకటాంపల్లిలో 2, పీసీ ప్యాపిలిలో 1 చొప్పున ఉన్నాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment