మూడు కుటుంబాల వెలి | Eviction of three families in the village | Sakshi
Sakshi News home page

మూడు కుటుంబాల వెలి

Published Wed, May 3 2023 4:32 AM | Last Updated on Wed, May 3 2023 4:32 AM

Eviction of three families in the village - Sakshi

పెదకూరపాడు: పల్నాడు జిల్లా పెదకూర­పాడు మండలం పొడపాడు గ్రామంలో మూడు కుటుంబాలపై వెలి వేసిన (సాంఘిక బహిష్కరణ) ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. గ్రామంలో ముస్లిం (దూదేకుల) సామాజిక వర్గా­నికి చెందిన 150 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. గడచిన పంచాయతీ ఎన్నికల్లో గ్రామానికి చెందిన మూడు కుటుంబాలు వైఎస్సార్‌సీపీకి మద్ద­తుగా నిలిచాయి.

కుల కట్టుబాటు ప్రకారం.. టీడీపీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకు­న్నట్టు ఆ కుల పెద్దలు ఆ మూడు కుటుంబాల వారికి చెప్పారు. అయితే, ఆ మూడు కుటుంబాలు వైఎస్సార్‌సీపీ బలపర్చిన అభ్య­ర్థికి ఓటు వేయడంతో ఎన్నికల నాటినుంచీ వారిని టీడీపీ నేతల ప్రోద్బలంతో సాంఘికంగా బహి­ష్కరించి.. మిగిలిన కుటుంబాలన్నీ వేరుగా చూస్తున్నా­యి. దీంతో బాధిత కుటు­ంబాలు ఆదివారం పెదకూర­పాడు పోలీసు­లకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న సత్తెనపల్లి డీఎస్పీ ఆదినారాయణ, సీఐ వీరా­స్వామి, తహసీల్దార్‌ క్షమారాణి సోమవారం రాత్రి గ్రామంలో ఆ సామాజిక వర్గం వారితో మాట్లాడారు.

ప్రజా­స్వామ్యంలో ఇలాంటి ఘటనలకు తావు లేదని, శాంతి­యుతంగా ఉండాలని అధికారులు సూచించారు. కాగా.. ఆ మూడు కుటుంబాలు క్షమా­పణ చెబితేనే కలిసి ఉంటా­మని కుల పెద్దలు చెప్పగా.. అందుకు ఆ మూడు కుటుంబాలు నిరాకరించాయి. దీంతో గందరగోళ పరిస్థితి ఏర్పడగా.. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఇరువర్గాలతో మాట్లాడినా ఎలాంటి ఫలితాలు రాకపోవ­డంతో గ్రామంలో పోలీస్‌ పికెట్‌ ఏర్పాటు చేశారు. చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే చర్యలు తప్పవని డీఎస్పీ ఆదినారాయణ హెచ్చరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement