ఏపీలో దారుణం.. వైద్యురాలి జుట్టు పట్టుకుని... | Patient Grabs Woman Doctor By Hair And Bangs Head Against Cot's Steel Rod In SVIMS, Watch Video Inside | Sakshi
Sakshi News home page

ఏపీలో దారుణం.. వైద్యురాలి జుట్టు పట్టుకుని...

Published Tue, Aug 27 2024 4:22 PM | Last Updated on Tue, Aug 27 2024 5:23 PM

Patient Grabs Woman Doctor By Hair in svims

అమరావతి : ఓ వైపు పశ్చిమ బెంగాల్‌ కోల్‌కతా ఆర్‌జీ కార్‌ ఆస్పత్రిలో జరిగిన దారుణంతో దేశవ్యాప్తంగా వైద్యుల రక్షణపై ఆందోళన నెలకొంది. ఈ తరుణంలో తిరుపతి శ్రీవెంకటేశ్వర ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎస్‌వీఐఎంఎస్‌)లో దారుణం జరిగింది.

ఆస్పత్రి వార్డ్‌లో రోగులకు చికిత్స అందిస్తున్న మహిళా డాక్టర్‌ను ఓ వ్యక్తి జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్తున్న దృశ్యాలు సీసీటీవీ పుటేజీలో రికార్డ్‌ అయ్యాయి. సదరు వ్యక్తి దాడితో ఆందోళనకు గురైన తోటి వైద్యులు.. బాధితురాల్ని రక్షించే ప్రయత్నం చేశారు.

ఈ ఘటనపై ఎవీఐఎంఎస్‌ డైరెక్టర్‌, వైస్‌ ఛాన్సలర్‌ డాక్టర్‌ ఆర్‌వి కుమార్‌ బాధిత మహిళా వైద్యురాలు లేఖ రాశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటనలో శనివారం ఎమెర్జెన్సీ మెడిసిన్‌ డిపార్ట్‌మెంట్‌లో తాను పనిచేస్తున్నానని, ఆ సమయంలో బంగారు రాజు అనే పేషెంట్‌ తన జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్లి.. పక్కనే ఉన్న స్టీల్‌ రాడ్డుకి తలను బలవంతంగా మోదే ప్రయత్నం చేసినట్లు పేర్కొన్నారు. అంతేకాదు ఈ ఘటనలో తనని రక్షించేందుకు భద్రతా సిబ్బంది ఎవరూ లేరని లేఖలో తెలిపారు.

 ఈ సందర్భంగా తాము పనిచేసే ప్రాంతాల్లో భద్రతా సమస్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. రోగి వద్ద పదునైన ఆయుధం ఉంటే పరిస్థితులు మరింత తీవ్రమయ్యేవి’అని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు భద్రత కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సంఘటన తర్వాత, ఆసుపత్రి వైద్యులు పని ప్రదేశంలో భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు.

వైద్యుల భద్రతపై టాస్క్‌ఫోర్స్‌
కోల్‌కతాలో ఆర్‌జీ కార్‌ ఆస్పత్రిలో జరిగిన దారుణంపై సుప్రీం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా వైద్యుల భద్రత కోసం జాతీయ ప్రొటోకాల్ రూపకల్పన కోసం 10 మంది సభ్యులతో టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది.ఈ నేపథ్యంలో తిరుపతిలోని స్విమ్స్‌లో జరిగిన ఘటనతో డ్యూటీలో ఉన్న వైద్యుల భద్రతపై మరోసారి చర్చనీయాంశమైంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement