గుత్తి : ప్రభుత్వ శాఖల్లో పర్మినెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను మోసం చేసిన ముగ్గురిని సోమవారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన మేరకు... కర్నూలుకు చెందిన మేరి సునీత, అన్నమయ్య జిల్లాకు చెందిన గుర్రం ప్రసాదరెడ్డి, షేక్ బాబ్జాన్ సాహెబ్ తదితరులు గుత్తికి చెందిన నిఖిల్‌తో పాటు మరి కొందరు నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నమ్మబలికి రూ.15 లక్షలు వసూలు చేశారు. నెలలు గడుస్తున్నా ఉద్యోగావకాశాలు కల్పించకపోవడంతో తాము మోసపోయినట్లుగా గుర్తించిన నిఖిల్, తదితరుల ఫిర్యాదు మేరకు చీటింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు మంగళవారం నిందితులను అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment