ఫెర్టిలైజర్ దుకాణాలపై విజిలెన్స్ దాడులు
ప్రత్తిపాడు: నియోజకవర్గ కేంద్రం ప్రత్తిపాడు లోని ఫెర్టిలైజర్ దుకాణాల్లో శుక్రవారం విజిలెన్స్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. విజిలెన్స్ ఎస్పీ డి.సూర్య శ్రావణ్ కుమార్‌తోపాటు సీఐలు కె.చంద్రశేఖర్, పి. శివాజీ, విజిలెన్స్ ఏవో ఆదినారాయణల బృందం స్థానిక ఏవో కె.అరుణకుమారితో కలిసి మంజునాథ ట్రేడర్స్, పయనీర్ ఆగ్రోస్ దుకాణాల్లో విస్తృత తనిఖీలు చేసింది. రికార్డులు, బిల్లు పుస్తకాలు, స్టాక్ రిజిస్టర్లును పరిశీలించారు. ఎస్పీ స్వయంగా గోడౌన్లకు వెళ్లి తనిఖీ చేశారు. స్టాకు వ్యత్యాసం ఉండటాన్ని గమనించారు. దీంతో మంజునాథ ట్రేడర్స్‌లో రూ.2.02,348 విలువ చేసే 11.36 మెట్రిక్ టన్నుల ఎరువులు, పయనీర్ ఆగ్రోస్‌లో రూ.1,96,300 విలువ చేసే 11.5 మెట్రిక్ టన్నుల ఫెర్టిలైజర్స్‌ను సీజ్ చేసినట్లు వ్యవసాయాధికారి అరుణకుమారి తెలిపారు. ఈ మేరకు ఆయా దుకాణాల నిర్వాహకులపై 6ఏ కేసులు నమోదు చేస్తున్నట్లు చెప్పారు. దాడుల్లో సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment