మంద కృష్ణకు మతిభ్రమించింది
తెనాలి: తెలంగాణ మాల సింహ గర్జన చూసి మందకృష్ణకు మతిభ్రమించిందని, ఏడో తరగతి చదివిన మందకృష్ణ.. మాల మేధావులను చర్చలకు పిలవడం హాస్యాస్పదమని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు, అఖిలభారత మాల సంఘాల జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు అన్నవరపు కిషోర్ వ్యాఖ్యానించారు. ఈ నెల 15న గుంటూరులో జరిగే మాలల మహాగర్జన సభను జయప్రదం చేయాలని కోరుతూ జనసమీకరణలో భాగంగా శుక్రవారం ఆయన తెనాలి వచ్చారు. స్థానిక అయితానగర్‌లోని మాలల మహా గర్జన జేఏసీ కార్యాలయంలో ‘హలో మాల–చలో గుంటూరు’ కరపత్రాన్ని ఆవిష్కరించారు. అక్కడే విలేకరులతో మాట్లాడుతూ, వర్గీకరణపై సుప్రీంకోర్టు ఆగస్టు ఒకటిన సూచనలు మాత్రమే చేసిందని గుర్తుచేశారు. దీనిని వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం దీనిపై కమిషన్ నియామకాన్ని కూడా వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు. రిజర్వేషన్ ఫలాలను మాలలు అనుభవిస్తూ దోచుకుతింటున్నారని 30 ఏళ్ల నుంచి మందకృష్ణ నమ్మిస్తూ విష ప్రచారంతో పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో అత్యధిక జనాభా గలిగిన మాలలు ఈ నెల 15వ తేదీన గుంటూరులో జరిగే మహా గర్జన సభలో తమ సత్తా చాటుతారని అన్నారు. జేఏసీ నాయకుడు యండ్రపాటి అశోక్ కుమార్, జేఏసీ మాల నాయకుడు బండికళ్ల బుల్లయ్య , బి.ప్రదీన్, డాక్టర్ కారుమంచి రవికుమార్, కంచర్ల కోటేశ్వరరావు, కె. సునీల్, జ్యోతుల బాబి, పిల్లి ప్రేమ్‌కుమార్, కొల్లూరి కిరణ్, పిల్లి తిమోతి, గడ్డేటి సుందర సునీల్, పిల్లి ప్రేమ్ కుమార్ పాల్గొన్నారు,
15న మహాగర్జనలో మాలలు సత్తా చాటాలి
ఏబీ జేఏసీ కన్వీనర్ అన్నవరపు కిషోర్
Comments
Please login to add a commentAdd a comment