పులకించిన భక్తజనం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ భక్తజనానికి దర్శన భాగ్యం కల్పించింది. అమ్మ దర్శనంతో శుక్రవారం భక్తుల మది పులకించింది. శ్రీదుర్గా మల్లేశ్వరస్వామివార్ల దర్శనానికి భక్తులు, నూతన వధూవరులు, యాత్రికుల తాకిడి పెరిగింది. సుముహూర్తాలతో ఒక్కటైన నూతన వధూవరులు, వారి కుటుంబ సభ్యులతో పాటు శుక్రవారం భక్తుల రద్దీతో ఆలయ ప్రాంగణంలో సందడి వాతావరణం నెలకుంది. ఆది దంపతులకు నిర్వహించిన అర్జిత సేవల్లో ఉభయదాతలు, భక్తులు విశేషంగా పాల్గొన్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున ఇంద్రకీలాద్రికి తరలిరావడంతో ఆలయ ప్రాంగణంలోని క్యూలైన్లు కిటకిటలాడాయి. భవానీలు, అయ్యప్పలు, శివ దీక్షధారణ చేసిన వారితో పాటు యాత్రలు చేసిన వారు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. పవిత్ర కృష్ణా నదిలో పుణ్యస్నానాలు చేసిన ఘాట్‌రోడ్డుతో పాటు మహా మండపం లిప్టు, మెట్ల మార్గంలో కొండపైకి చేరుకున్నారు. సర్వ దర్శనంతో పాటు రూ. 100, రూ.300, రూ.500 టికెట్ క్యూలైన్లలో భక్తుల రద్దీ కనిపించింది. మధ్యాహ్నం అమ్మవారికి మహా నివేదన సమర్పించేందుకు అర్ధగంట పాటు అన్ని దర్శనాలు నిలిపివేశారు. దీంతో రద్దీ పెరగడంతో క్యూలైన్‌లో త్వరితగతిన ముందుకు కదిలిలా చర్యలు తీసుకున్నారు. సాయంత్రం అమ్మవారికి పంచహారతుల సేవ, పల్లకీ సేవల్లోనూ ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు.
దుర్గమ్మ సన్నిధిలో భక్తుల సందడి నూతన వధూవరులు, యాత్రికుల తాకిడి అర్జిత సేవలకు డిమాండ్
Comments
Please login to add a commentAdd a comment