ఐఏఎల్ నూతన క్యాలెండర్ ఆవిష్కరణ
నగరంపాలెం: స్థానిక జిల్లా కోర్టు ఆవరణలోని గుంటూరు బార్ అసోసియేషన్ భవనంలో శుక్రవారం ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ (ఐఏఎల్) జిల్లా సమితి ఆధ్వర్యంలో నూతన క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు జె.నరసింహారావు, రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి పర్చూరు నంద, రాష్ట్ర ఉపాధ్యక్షులు సిద్దా సత్యనారాయణ, జిల్లా అధ్యక్షులు చెరుకూరి సత్యనారాయణ, అరసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెనుగొండ లక్ష్మీనారాయణ, బార్ అసోసియేషన్ సీనియర్ ఈఎం ఎస్‌బీఏ ఝాన్సీ, మాజీ అధ్యక్షులు కేవీకే సురేష్, సభ్యులు కె.నరసింహం, వేముల జయపాల్, కె.అంబిక, వి.లక్ష్మీతిరుపతమ్మ, న్యాయవాదులు పాల్గొన్నారు. అనంతరం టేబుల్, పాకెట్ క్యాలెండర్లను న్యాయవాదులు, న్యాయవాద గుమస్తాలకు అందజేశారు. కోర్టుకు సంబంధించిన సెలవు దినాలతో ముద్రించిన క్యాలెండర్ అందరికీ ఉపయుక్తంగా ఉందని వక్తలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment