ఫారెస్ట్రీ కోర్సుతో ఉజ్వల భవిష్యత్తు
రిజిస్ట్రార్ ఆచార్య సింహాచలం
ఏఎన్‌యూ: ఎమ్మెస్సీ ఫారెస్ట్రీ కోర్సు చేసిన వారికి ఉజ్వల భవిష్యత్తు ఉందని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ ఇన్‌చార్జి రిజిస్ట్రార్ ఆచార్య జి. సింహాచలం అన్నారు. యూనివర్సిటీ వృక్ష శాస్త్రం, ఫారెస్ట్రీ విభాగాల ఆధ్వర్యంలో శుక్రవారం హెర్బల్ గార్డెన్‌లో షెడ్ నెట్, పాలీహౌస్‌లను ప్రారంభించారు. ముఖ్య అతిథిగా రిజిస్ట్రార్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో ఫారెస్ట్రీ కోర్సు నడుపుతున్న ఏకై క విశ్వవిద్యాలయం తమదేనన్నారు. విద్యార్థులు కేవలం ప్రభుత్వ ఉద్యోగాల కోసమే చూడకుండా స్వయంగా స్టార్టప్‌లు ఏర్పాటు చేసి అనేక మందికి ఉపాధి కల్పించాలని సూచించారు. విశిష్ట అతిథిగా ఐఎఫ్‌ఎస్ అధికారి రామకృష్ణ మాట్లాడుతూ.. పెరిగిపోతున్న కాలుష్యం వలన భూతాపం పెరిగి వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయని పేర్కొన్నారు. కర్బన ఉద్గారాలను తగ్గించడానికి కాప్ సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆగస్టులో ఏపీ బయోడైవర్సిటీ బోర్డు జీవవైవిధ్య పరిరక్షణలో యువత పాత్ర అనే అంశంపై నిర్వహించిన వివిధ పోటీలలో విజేతలకు బహుమతులను అందజేశారు. ఎంఎస్సీ ఫారెస్ట్రీ విభాగాధిపతి ఆచార్య కె.మల్లికార్జున మాట్లాడుతూ ఏపీ ఫారెస్ట్రీ విభాగంతో సంయుక్తంగా ఈ కోర్సును నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో విభాగం అధ్యాపకులు డాక్టర్ అమృతవల్లి, డాక్టర్ మాధవి, డాక్టర్ తిరుపతిరావు, డాక్టర్ పీఎస్ రాజు, పలువురు అతిథి అధ్యాపకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment