సీఐటీయూ ఆధ్వర్యంలో కరెంటు బిల్లుల దహనం
పిడుగురాళ్ల: పెంచిన కరెంటు చార్జీలను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో పట్టణంలోని పిల్లుట్ల రోడ్డులో శుక్రవారం బిల్లులను దహనం చేశారు. సీపీఎం మండల కార్యదర్శి తెలకపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ అధికారంలోకి వస్తే కరెంట్ బిల్లుల పెంపుదల చేయమని చెప్పిన కూటమి ప్రభుత్వం ఆరు నెలల్లోనే ప్రజలపై యూజర్ చార్జీల పేరుతో భారాలు మోపుతోందని విమర్శించారు. వెంటనే పెంచిన విద్యుత్ చార్జీలు వెనక్కి తీసుకోవాలని, స్మార్ట్ మీటర్లు బిగించడాన్ని నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ సంస్కరణ బిల్లును కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు షేక్ బాబు, గుదే బిక్షాలు, జి. నాగేశ్వరరావు, కొమ్ము పుల్లయ్య, కనకారావు, షేక్‌మాబు, హసాన్‌వలి, మురికిపూడి చిన్న, ధీరు నాయక్, కోటేశ్వరరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment