మద్యం దుకాణంలో ఘర్షణ
ముప్పాళ్ల: స్థానిక మద్యం దుకాణంలో టేబుల్ వద్ద కుర్చీ విషయంలో ఇరువురి మధ్య వాదన ముదిరి జరిగిన ఘర్షణలో ఒకరు గాయపడిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు కథనం.. గుంటూరు బ్రాంచి కాలువ పక్కనే ఉన్న ఓ వైన్స్‌లో గనికపూడి శేషు, షేక్ మస్తాన్‌వలి(కుంటిమద్ది) మద్యం తాగుతున్నారు. నరసరావుపేట మండలం ములకలూరుకు చెందిన చింత మెహర్‌బాబు, బొమ్మిశెట్టి వాసు, పి.కాళిదాసు, ఎ.కాళీలతో పాటుగా మరికొంత మంది మద్యం తాగేందుకు వచ్చారు. పక్కనే ఉన్న కుర్చీలు తీసుకుంటుండగా శేషు, మస్తాన్‌వలి తమ వాళ్లు వస్తారని, వేరే టేబుల్ వద్దకు వెళ్లాలని సూచించారు. ఈ క్రమంలో ఇరువర్గాల మద్య వాదనలు ముదిరి ఘర్షణ పడ్డారు. మస్తాన్‌వలి పై ములకలూరుకు చెందిన వారు కుర్చితో దాడి చేయటంతో పక్కనే ఉన్న ముస్లిం యువకులు ములకలూరుకు చెందిన వారిపై ఎదురు దాడికి దిగారు. ఇరువర్గాల వారు దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో ములకలూరుకు చెందిన వారు బీరు బాటిల్ పగలకొట్టి శేషు తలపై కొట్టడంతో తీవ్ర గాయమైంది. సమాచారం అందుకున్న ఎస్‌ఐ యు.సోమేశ్వరరావు ఘటనా స్థలానికి చేరి ఇరువర్గాల వారిని తరిమివేయటంతో వివాదం సద్దుమణిగింది. ములకలూరుకు చెందిన నలుగురుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన మస్తాన్‌వలి, శేషులను చికిత్స నిమిత్తం సత్తెనపల్లి వైద్యశాలకు తరలించారు. ఘటపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. సత్తెనపల్లి రూరల్ సీఐ ఎంవీ సుబ్బారావు ముప్పాళ్లకు చేరుకొని సంఘటనపై విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment