ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా
నరసరావుపేట రూరల్: ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటన పల్నాడు జిల్లా పెట్లూరివారిపాలెం వద్ద బుధవారం చోటుచేసుకుంది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాలు.. బెంగళూరు నుంచి పిడుగురాళ్ల వస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు మార్గమధ్యలో ప్రయాణికులను దింపేందుకు నరసరావుపేట వస్తోంది. పెట్లూరివారిపాలెం వద్దకు చేరుకున్న సమయంలో బ్రేకులు ఫెయిల్ కావడంతో బస్సు అదుపుతప్పింది. రోడ్డు పక్కనున్న మార్జిన్‌లోకి వెళ్లి బోల్తా కొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. స్థానికులు అక్కడకు చేరుకొని బస్సులో ఉన్న ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీశారు. రూరల్ సీఐ పి.రామకృష్ణ, ఎస్‌ఐ కిశోర్ ఘటనా స్థలానికి చేరుకొని ప్రయాణికులకు వేరే బస్సులో తరలించారు. ప్రమాద సమయంలో బస్సులోని ఆయిల్ రోడ్డుపై పడటంతో ప్రమాదాలు చోటుచేసుకోకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని రోడ్డును శుభ్రం చేశారు.
బ్రేక్ ఫెయిల్ కావడంతో అదుపుతప్పిన బస్సు 20 మంది ప్రయాణికులు సురక్షితం
Comments
Please login to add a commentAdd a comment