ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలి
గుంటూరు వెస్ట్: జిల్లాలో ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని వీడియో సమావేశ మందిరం నుంచి అధికారులతో వర్చువల్‌గా మాట్లాడుతూ గ్రౌండ్ లెవల్ పూర్తయిన ఇళ్ల లబ్ధిదారులకు స్వయం సహాయక సంఘాల ద్వారా బ్యాంకు లింకేజి రుణాలు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇళ్ల నిర్మాణంలో ఏర్పడే చిన్న చిన్న సమస్యలను అధికారులు అప్పటికప్పుడే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో వసతుల కల్పనను సంక్రాంతి నాటికి పూర్తి చేయాలని తెలిపారు. పోషణ్ వాటికలు ఏర్పాటు చేసి వినియోగంలోకి తీసుకు రావాలని పేర్కొన్నారు. జిల్లాలో గ్రామ, వార్డు, సచివాలయ సిబ్బంది హౌస్‌హోల్డ్ సర్వే వేగవంతం చేయాలన్నారు. సచివాలయ ఉద్యోగులు ప్రతిరోజూ ఆన్‌లైన్ అటెండెన్స్ వేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. సంక్రాంతి నాటికి రోడ్ల మరమ్మతులు పూర్తి చేయాలని సూచించారు. మంగళవారం ఉదయం నుంచి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ఎలాంటి అసౌకర్యం లేకుండా పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. సమావేశంలో హౌసింగ్ పీడీ ప్రసాద్, సీపీఓ శేషశ్రీ, ఐసీడీఎస్ పీడీ ఉమాదేవి, డీఆర్‌డీఏ పీడీ విజయలక్ష్మి, డీపీఓ సాయికుమార్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మి
Comments
Please login to add a commentAdd a comment