ముక్కోటి నాటికి గిరిజన పల్లె!
భద్రాచలం: భద్రాచలంలోని ఐటీడీఏ ప్రాంగణంలోని ట్రైబల్ మ్యూజియం సమీపాన నిర్మిస్తున్న గిరిజన పల్లెను ముక్కోటి ఉత్సవం రోజున ప్రారంభిస్తామని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ తెలిపారు. పల్లె ఏర్పాటు పనులను సోమవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. వచ్చే నెల 9, 10వ తేదీల్లో జరిగే సీతారామచంద్ర స్వామి వారి తెప్పోత్సవం, ఉత్తర ద్వార దర్శనానికి వచ్చే ప్రతీ ప్రతీ భక్తుడు మ్యూజియం, గిరిజన పల్లెను సందర్శించేలా భద్రాచలంలోని ముఖ్య కూడళ్లలో బోర్డులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే, ఇక్కడ పర్యాటకులు, భక్తులకు సంప్రదాయరీతిలో స్వాగతం ఉంటుందని చెప్పారు. ఇక కొండరెడ్ల కుటుంబాలకు సంబంధించిన గృహోపకరణాలు, సెల్ఫీ పాయింట్ ఏర్పాటు, విద్యుత్ దీపాలతో అలంకరణపై ఉద్యోగులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ జనరల్ డేవిడ్‌రాజ్, ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ తానాజీ, డీడీ మణెమ్మ, అధికారులు ఉదయ్‌కుమార్, చంగల్‌రావు, మునీర్‌పాషా, హరీశ్, స్పందన, హరికృష్ణ, శ్రీనివాస్, వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.
● ఐటీడీఏ సమావేశ మందిరంలో జరిగిన గిరిజన దర్బార్‌లో పీఓ బి.రాహుల్ పాల్గొన్నారు. వివిధ ఆదివాసీ, గిరిజన గ్రామాల నుండి వచ్చిన ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి పరిష్కాంపై యూనిట్ అధికారులకు సూచనలు చేశారు.
● స్నాక్స్, చాట్, గిరిజన సంప్రదాయ, ఇతర వంటకాల తయారీలో ఆసక్తి, అనుభవం ఉన్న అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పీఓ బి.రాహుల్ తెలిపారు. గిరిజన మ్యూజియంలో వంట తయారీ కోసం ఆసక్తి ఉన్న అనుభవ ధ్రువపత్రాలతో ఐటీడీఏ కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం 2గంటలకు హాజరు కావాలని సూచించారు.
పనులను పరిశీలించిన ఐటీడీఏ పీఓ రాహుల్
Comments
Please login to add a commentAdd a comment