రాజకీయదాడులు అనైతికం
● టీడీపీ నేతలపై హత్యాయత్నం కేసుకు డిమాండ్
● కడపలో ‘సాక్షి’ ప్రతినిధులపై
దాడిని ఖండించిన పాత్రికేయులు
● చిత్తూరు కలెక్టరేట్ వద్ద నిరసన..
నిందితుల అరెస్టుకు కలెక్టర్‌కు వినతి
చిత్తూరు అర్బన్: ప్రజాస్వామ్యంలో నిజానిజాలను బ యటపెట్టడానికి పనిచేస్తున్న పాత్రికేయులపై రాజకీ య పార్టీ నేతలు దాడులు చేయడం అనైతికమని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) జిల్లాఅధ్యక్షుడు ఎం.లోకనాథన్ అన్నా రు. ఇలాంటి దాడులు ప్రజాసామ్యంపై గొడ్డలిపెట్టులాంటివని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ కడప జిల్లా వేముల తహసీల్దార్ కార్యాలయం వద్ద సాగు నీటి సంఘాల ఎన్నికల కవరేజీకి వెళ్లిన సాక్షి మీడి యా ప్రతినిధులపై దాదాపు 50 మంది టీడీపీ మూక లు దాడులకు పాల్పడిన ఘటనపై కదం తొక్కుతూ చిత్తూరులో ఏపీయూడబ్ల్యూజే జిల్లా శాఖ, చిత్తూరు ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. శుక్రవా రం చిత్తూరు కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ధర్నా కా ర్యక్రమంలో పెద్ద ఎత్తున పాత్రికేయులు పాల్గొని, నిరసన వ్యక్తం చేశారు. లోకనాథన్ మాట్లాడుతూ ఇటీవల రాష్ట్రంలో పాత్రికేయులపై జరుగుతున్న వరుస దాడు లు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. విధి నిర్వహణ లో భాగంగా న్యూస్ కవరేజీ కోసం వెళ్లిన ‘సాక్షి’ మీడి యా ప్రతినిధులు శ్రీనివాస్, రాజారెడ్డి, రాములపై అక్కడి టీడీపీ నాయకులు రాళ్లు, కర్రలతో మూకుమ్మడిగా దాడులకు పాల్పడటం అత్యంత హే యమైన చర్యగా అభివర్ణించారు. ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టాన్నారు. రాజ్యాంగం కల్పించిన భావ వ్యక్తీకరణ హక్కును కాలరాస్తూ టీడీపీ నేతలు పాత్రికేయులపై దాడులకు తెగబడడం మంచిదికాదన్నారు. ప్రభుత్వం సైతం ఇలాంటి ఘటనల్లో నిందితులను వెనకేసుకునిరాకుండా నిస్పక్షపాతంగా వ్యవహరించి, దాడులు చేసిన వారిపై చట్టరీత్యా చర్యలకు ఆ దేశించాలన్నారు. దాడి చేసిన టీడీపీ నేతలపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి, 24 గంటల్లో నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. చిత్తూరు ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు జి.రమేష్‌బాబు, ఉపాధ్యక్షుడు టి. శివప్రసాద్, ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి కెఎం.అశోక్‌కుమార్, సీనియర్ పాత్రికేయులు మహేష్, గజపతి, సురేంద్రరెడ్డి, శివకుమార్, హరీష్, చంద్రప్రకాష్, అయ్యప్పనాయుడు, చంద్ర, తేజ, రాజే ష్, శ్రీనివాసులు, జయకుమార్ పాల్గొన్నారు.
కలెక్టర్‌కు వినతి..
దాడి ఘటనలో నిందితులపై చట్టరీత్యా చర్యలు కో రుతూ పాత్రికేయులంతా కలిసి చిత్తూరు ఇన్‌చార్జ్ కలెక్టర్ విద్యాధరికి వినతిపత్రం అందజేశారు. ఇటీవల పాత్రికేయులపై జరిగిన పలు దాడుల గురించి ఆమెకు వివరించారు. భవిష్యత్తులో ఇలాంటివి పు నరావృతం కాకుండా నిందితులపై కఠినంగా వ్యవ హరించాలన్న తమ డిమాండ్‌ను ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని కోరారు. దీనిపై ఇన్‌చార్జి కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ.. పాత్రికేయుల విన్నపాన్ని ప్రభుత్వానికి పంపుతామన్నారు.
వైఎస్సార్‌సీపీ నేతల ఖండన..
మరోవైపు ‘సాక్షి’ ప్రతినిధులపై జరిగిన దాడిని వైఎ స్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్పు పట్టారు. కలెక్టరేట్ వద్ద అన్నదాతలకు అండగా కార్యక్రమం నిర్వహించిన అనంతరం వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కేజేఆర్ భరత్, మాజీ ఎంపీ రెడ్డెప్ప, చిత్తూరు నియోజకవర్గ ఇన్‌చార్జి ఎంసీ విజయానందరెడ్డి, పూతలపట్టు, గంగాధరనెల్లూరు, పలమనేరు ని యోజకవర్గాల ఇన్‌చార్జిలు డాక్టర్ సునీల్, కృపాలక్ష్మి, వెంకటేగౌడ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. నిందితులను చంద్రబాబు నాయుడు వెనకేసుకుని రాకూడదన్నారు. దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేసేలా పోలీసుశాఖను ప్రభుత్వం ఆదేశించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment