గతంలో సమయానికి ఫీజు రీయింబర్స్‌మెంట్
గత ప్రభుత్వ హయాంలో ఉన్నత విద్య చదివే విద్యార్థులెవ్వరికీ ఇబ్బందులు లేకుండా ప్రతి ఏటా సమయానికి ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను తల్లుల ఖాతాల్లో జమచేసేవారు. ప్రతి 3 నెలలకోసారి, త్రైమాసికం అయిన వెంటనే విద్యార్థుల తల్లులకు డబ్బులిచ్చి వారి చదువులకు తోడుగా నిలిచారు. ఆరు నెలలుగా విద్యార్థులకు విద్యా దీవెన, వసతి దీవెన అందక ఇబ్బంది పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 91,320 మంది విద్యార్థులకు రూ.150.28 కోట్ల వరకు నిధులు విడుదల చేయాల్సి ఉంది. ఫీజులు చెల్లించలేక చదువులు మానేసి పనులకు వెళ్తున్నారు. విద్యార్థులు ఫీజులు చెల్లించకపోవడంతో జిల్లా వ్యాప్తంగా పలు యాజమాన్యాలు కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందకుండా ఇబ్బందులు పడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment