చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా 2019కు ముందు సర్కారు బడుల పట్ల తల్లిదండ్రులకు చిన్నచూపు ఉండేది. 90 శాతానికి పైగా తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలల వైపే మొగ్గు చూపించేవారు. అలాంటి పరిస్థితులను అధిగమించి 2019 నుంచి 2024 సార్వత్రిక ఎన్నికల వరకు గత వైఎస్సార్‌సీపీ సర్కారు అనేక సంక్షేమ పథకాలను అమలు చేసింది. గత ఐదేళ్లలో శిథిలావస్థకు చేసిన సర్కారు బడులకు ఊపిరి పోసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యాభివృద్ధి కోసం సంక్షేమ పథకాలను దిగ్విజయంగా అమలు చేసిది. ప్రతి ఏటా డిసెంబర్ 21వ తేదీన అప్పటి సీఎం వైఎస్.జగన్ పుట్టినరోజును పురస్కరించుకుని ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులను ఉచితంగా అందజేసింది. ఈ ఏడాదిలో కూటమి ప్రభుత్వం కొత్త ట్యాబ్‌లను ఇవ్వకపోగా గత ప్రభుత్వం ఇచ్చిన ట్యాబ్‌లను విద్యార్థులు వినియోగించకుండా కక్ష సాధిస్తోందని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
● పేదల చదువులపై కత్తి దూసిన సర్కార్ ● పథకాలకు పంగనామాలు.. చిక్కిన చదువులు ● ఈ ఏడాదిలో ట్యాబ్‌లు అందక నష్టపోయిన విద్యార్థులు ● విద్యాభివృద్ధికి వన్నె తెచ్చిన మాజీ సీఎం వైఎస్.జగన్
Published Sat, Dec 21 2024 1:43 AM | Last Updated on Sat, Dec 21 2024 1:43 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment