Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Sakshi Editorial On Chandrababu Govt Irrigation Water1
సాగునీళ్లూ షాక్‌ కొడతాయా?

‘‘టంగుటూరు మిరియాలు తాటికాయలంత...’’. తెలుగు నాట ఇదొక సామెత. చేతలు గడప దాటకుండానే మాటల్ని కోటలు దాటించే కోతల రాయుళ్లపై ఇటువంటి సామెతలు చాలానే ఉన్నాయి. ఈ మధ్య ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎడాపెడా విసురుతున్న మాటల ఈటెల్నీ, పలుకుతన్న పద జాలాన్నీ చూస్తుంటే ఈ సామెతలు సరిపోవనిపిస్తున్నది. ‘విజన్‌–2047’ పేరుతో ఆయన అట్టహాసంగా ఓ డాక్యుమెంట్‌ను ఇటీవల విడుదల చేశారు. ఈ విజన్‌ దెబ్బకు ఇంకో ఇరవై మూడేళ్లలో ఏపీ స్టేట్‌ ‘ఏక్‌ నంబర్‌ స్టేటస్‌’ చేరుకోనున్నదని ఆ సందర్భంగా ఆయన ఉద్ఘాటించారు. ‘ఏక్‌ నంబర్‌ స్టేటస్‌’ వస్తున్నప్పుడు స్పెషల్‌ స్టేటస్‌ ఎందుకనుకున్నారేమో గానీ, ఆ డాక్యుమెంట్‌లో అటువంటి ప్రస్తావన లేదు.చంద్రబాబు పార్టీకి గానీ, యెల్లో మీడియాకు గానీ ఇలా గొప్పలకు పోవడం, డప్పు వాయించుకోవడం కొత్తేమీ కాదు. కానీ, వారు ప్రగల్భాలకు మాత్రమే పరిమితం కావడం లేదు. జనం మీదకు తేనె పూసిన కత్తుల్ని విసురుతున్నారు. విష గుళికలకు విజన్‌ లేబుళ్లు వేస్తున్నారు. కాకుల్ని కొట్టి, గద్దల్ని మేపే సామాజిక దుర్నీతి ఆయన తాజా విజన్‌ నిండా పరుచుకున్నదనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఆ విజన్‌ డాక్యుమెంట్‌ మీద ఇంకా పూర్తి స్థాయి చర్చ ప్రారంభం కాక ముందే, అందులోంచి ఆయన ఓ జలపాత దృశ్యాన్ని బయటకు తీశారు. అరుంధతీ నక్షత్రం మాదిరిగా యెల్లో మీడియా దాన్ని ప్రజలకు చూపెట్టింది. ఈ నక్షత్రానికి ఆయన ‘తెలుగుతల్లికి జలహారతి’ అని నామకరణం కూడా చేసుకున్నారు.ఈ ‘జలహారతి’ పథకం తన ‘మానస పుత్రిక’ని కూడా బాబు ప్రకటించుకున్నారు. ‘విజన్‌ డాక్యుమెంట్‌’లో పండంటి రాష్ట్రానికి పది సూత్రాలని చెప్పుకున్నారు. ఆ పది సూత్రాల్లో ఒకటి ‘జలభద్రత’. నదుల అనుసంధానం ద్వారా ‘జలభద్రత’ కల్పించాలన్న ఒక అంశానికి కొనసాగింపుగా ఈ ‘జలహారతి’ పథకాన్ని ప్రకటించారు. ఈ విజన్‌ను కొంత లోతుగా తరచి చూస్తే, ఇందులో ఎంత ప్రజావ్యతిరేకత దాగి ఉన్నదో, పెత్తందారీతనపు ఫిలాసఫీ ఎలా ఇమిడి ఉన్నదో అవగతమవుతుంది.2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే, నాటి ముఖ్య మంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి గోదావరి – బనకచర్ల ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. జల వనరుల అధికార్లు,ఇంజినీర్లతో పలు దఫాల సమీక్ష, సాంకేతిక అంశాల పరిశీలన తర్వాత ఒక సమగ్ర నివేదిక (డీపీఆర్‌)ను జగన్‌ ప్రభుత్వం తయారు చేసింది. పోలవరం కుడి కాల్వ ప్రవాహ సామర్థాన్ని పెంచి, ఈ కొత్త ప్రాజెక్టుకు అవసరమైన నీటిని కూడా దాని ద్వారా తరలించి ప్రకాశం బరాజ్‌కు చేర్చాలని నిర్ణయించారు. అక్కడి నుంచి సాగర్‌ కుడి కాల్వను ఉపయోగించుకొని, బొల్లాపల్లి దగ్గర కొత్తగా నిర్మించే రిజర్వాయర్‌కు చేరుస్తారు. అక్కడి నుంచి బనకచర్ల క్రాస్‌ రెగ్యులేటర్‌ దగ్గరికి చేర్చాలి. ఇదీ ప్రాజెక్టు.ఈ ప్రాజెక్టు వల్ల సాగర్‌ కుడి కాలువతో పాటు, వెలిగొండ, తెలుగుగంగ, ఎస్సార్‌ బీసీ, గాలేరు–నగరి తదితర ప్రాజెక్టుల కింద ఉన్న 22 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడం జరు గుతుంది. అదనంగా ఏడున్నర లక్షల ఎకరాల ఆయకట్టు చేరుతుందనీ, 80 లక్షల జనాభాకు తాగునీటి వసతి లభిస్తుందనీ అంచనా వేశారు. ఇందులో నదుల అనుసంధానానికి సంబంధించిన అంశం ఇమిడి ఉన్నందువల్ల అనుసంధానం కేంద్రం బాధ్యత కనుక ఈ ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇవ్వాలని ప్రధాన మంత్రికి జగన్‌ మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రధాని సూచన మేరకు ‘కేంద్ర జలసంఘం’ అనుమతి కోసం 2022లోనే రాష్ట్రం ఈ ప్రాజెక్టుపై డీపీఆర్‌ను సమర్పించింది.అదిగో అదే డీపీఆర్‌ను ఇప్పుడు బయటకు తీసి తన మానస పుత్రికగా చంద్రబాబు ప్రకటించుకున్నారు. నామకరణ మహోత్సవాన్ని కూడా జరుపుకున్నారు. అయితే ఇందులో ఒక్క మార్పు మాత్రం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. పోలవరం కుడి కాలువ సామర్థ్యం పెంచడం ద్వారా బనకచర్లకు కూడా వరద రోజుల్లో రోజుకు రెండు టీఎమ్‌సీల చొప్పున తరలించాలన్నది గత ప్రభుత్వ ప్రతిపాదన. చంద్రబాబు సర్కార్‌ ఇక్కడ మార్పు చేసింది. పోలవరం ప్రాజెక్టుకు దిగువన తాడిపూడి పాయింట్‌ దగ్గర ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేసి, కుడి కాల్వకు సమాంతరంగా మరో కాలువను తవ్వి, నీటిని తరలించాలని ప్రతిపాదించింది.ఎత్తిపోతల పంపుల కోసం, కరెంట్‌ కోసం అదనపు ఖర్చు. మరో కాలువ తవ్వడానికి భూసేకరణ ఒక ప్రధాన సమస్య. అదనపు ఖర్చు కూడా. జగన్‌ పథకాన్ని యథాతథంగా కాపీ చేయకుండా ఈ ఒక్క మార్పును ఎందుకు చేసినట్టు? అదనపు ఖర్చు వల్ల అదనపు కమిషన్‌ లభిస్తుందన్న కండూతి ఒక కారణం కావచ్చు. దీంతోపాటు ఇంకో విమర్శ కూడా వినిపి స్తున్నది. పోలవరం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 45.72 మీటర్లకు బదులుగా 41.15 మీటర్లకే పరిమితం చేయడానికి బాబు సర్కారు అంగీకరించిందనీ, ఈ మేరకు కేంద్ర కేబినెట్‌లో కూడా నిర్ణయం జరగిందనీ ఇటీవల సాక్షి మీడియాలో ప్రము ఖంగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ తాడిపూడి ఎత్తి పోతల నిర్ణయం కూడా దాన్ని నిర్ధారిస్తున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.41.15 మీటర్ల ఎత్తుకే నీటి నిల్వను పరిమితం చేస్తే కుడి కాలువ ఆయకట్టుకే సరిపోను నీటిని అందివ్వలేదనీ, అటువంట ప్పుడు ఇక బనకచర్లకు తరలింపు ఎలా సాధ్యమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కనుక ప్రాజెక్టు దిగువన కూడా వరద రోజుల్లో ప్రవాహం ఉన్నప్పుడు ఎత్తిపోయడానికి ఈ పథకాన్ని మార్చి ఉండవచ్చని తెలుస్తున్నది. ఇంకొక ముఖ్యమైన మార్పు సిసలైన గేమ్‌ ఛేంజర్‌ వంటి అంశం మరొకటి ఉన్నది. నదుల అనుసంధానం కింద ఈ ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇవ్వాలని జగన్‌ ప్రభుత్వం కోరింది. కానీ, చంద్రబాబు ఆలోచన మరో విధంగా ఉన్నది. ఈ పాజెక్టును ప్రకటించిన సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ అసలు విషయాన్ని కొద్దిగా ఆయన బయట పెట్టారు. ప్రాజెక్టు కోసం కేంద్రం నిధులిచ్చే అవకాశం లేదని చెబుతూ – ప్రైవేట్‌ వ్యక్తుల ద్వారా సేకరిస్తామని చెప్పారు. ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు పదేళ్లదాకా వాటి నిర్వహణను కూడా ప్రైవేట్‌ వారికే అప్పగిస్తామన్నారు. ఇటీవలే గ్రామీణ రోడ్ల నిర్మాణం – నిర్వహణను ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగిస్తామని చంద్రబాబు చెప్పిన విషయం పాఠకులకు గుర్తుండే ఉంటుంది. ప్రైవేట్‌ వ్యాపారులు, సేవా దృక్పథంతో రోడ్లేయరు కదా! జనం తోలు వలిచి టోల్‌ వసూలు చేస్తారు. ఇక సాగునీటి సరఫరాకు కూడా అదే పద్ధతి రాబోతుందన్న మాట.ప్రాజెక్టులు నిర్మించి, నిర్వహించినందుకు ప్రభుత్వమే వారికి సొమ్ము చెల్లిస్తుందని ప్రస్తుతానికి ముఖ్యమంత్రి చెబుతు న్నప్పటికీ అది నమ్మశక్యంగా లేదు. అంతటి ఆర్థిక సామర్థ్యమే ఉంటే, మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్టుగా జలయజ్ఞంలోని అసంపూర్తి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి నడుం కట్టేవారు. ఈ ప్రాజెక్టు నదుల అనుసంధానంలో భాగం కనుక కేంద్ర నిధుల కోసం ఒత్తిడి చేసేవారు. పైగా తమ సంఖ్యా బలం మీద ఆధార పడిన ప్రభుత్వాన్ని ముక్కుపిండి ఒప్పించడం ఎంతసేపు? జగన్‌ సర్కార్‌ డీపీఆర్‌ను కాపీ కొట్టిన ప్రభుత్వం ఆయన అనుసరించిన వైఖరిని ఎందుకు అనుకరించడం లేదు?ఎందుకంటే, సంపూర్ణ ప్రైవేటీకరణ ఆయన విధానం కనుక. ప్రజలకు ఏదీ ఉచితంగా ఇవ్వడానికి వీల్లేదనీ, ప్రభుత్వ సేవలన్నిటికీ యూజర్‌ చార్జీలను వసూలు చేయాల్సిందేననీ గతంలోనే తన సిద్ధాంత పత్రాన్ని ఆయన రాసుకున్నారు కనుక. పాతికేళ్ల కింద ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ మాదిరిగానే ‘విజన్‌ 2020’ని చంద్రబాబు ప్రకటించారు. అప్పుడు ఆకాంక్షించిన ఆర్థిక వృద్ధి జరిగిందా? కొందరు బలవంతులు మాత్రం మహాబలసంపన్నులుగా ఎదిగి పోయారు. ఆర్థిక అసమానతలు అమానవీయంగా పెరిగి పోయాయి. ఆ డాక్యు మెంట్‌కు కొనసాగింపే ‘విజన్‌ – 2047’. అంతేగాకుండా, కేంద్ర సర్కార్‌ ఇప్పటికే ప్రకటించిన ‘వికసిత్‌ భారత్‌–2047’కు అనుగుణంగా దీన్ని రూపొందించినట్టు స్వయంగా ముఖ్యమంత్రే చెప్పారు. దొందూ దొందే. మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌.చంద్రబాబు ప్రైవేటీకరణ పదజాలంలోకి కొత్త మాటలు వచ్చి చేరుతున్నాయి. గతంలో పీత్రీ (P3) మోడల్‌ను తానే ప్రతి పాదించాననీ, ఇప్పుడింకో ‘పీ’ని చేర్చి పీఫోర్‌ (P4)ని ప్రతిపా దిస్తున్నాననీ ఆయన చెప్పారు. పబ్లిక్‌–ప్రైవేట్‌ పార్టనర్‌షిప్‌లో పీపుల్‌ను కూడా చేర్చారట. ‘పీత్రీ’ని అమలు చేసినప్పుడు పబ్లిక్‌ రంగ ఆస్తులను ప్రైవేట్‌ వ్యక్తులకు కట్టబెట్టారు. లాభసాటిగా నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను ఖాయిలా పట్టించి కోట్ల విలువైన వాటి ఆస్తులతో సహా 54 సంస్థలను పప్పుబెల్లాలకు తన వారికి కట్టబెట్టిన ఉదంతాన్ని మరిచిపోగలమా?ఇప్పుడు ఇంకో ‘పీ’ పేరుతో ప్రజల్ని చేర్చారు. ప్రజలు ఎలా భాగస్వాములు అవుతారు? ప్రైవేట్‌ ఆస్తులను ప్రజలకైతే అప్పగించరు కదా! ప్రజలే వారి దగ్గర ఉన్న భూముల్ని ఇవ్వాల్సి ఉంటుంది. ప్రైవేట్‌ సేవలకు మెచ్చి నీటి పన్ను, బాట పన్ను, బడి పన్ను, దవాఖానా పన్ను వంటి వాటిని అవసరాన్ని బట్టి చెల్లించవలసి ఉంటుంది. తమ రెక్కల కష్టాన్ని సమర్పించు కోవాల్సి ఉంటుంది. ప్రజల భాగస్వామ్యానికి సంబంధించి ఇంతకంటే భిన్నమైన ప్రతిపాదనలైతే విజన్‌లో కనిపించలేదు. ఆంధ్రప్రదేశ్‌ అడ్రస్‌ను వెతుక్కుంటూ వేలకోట్ల పెట్టుబడులు పరుగెత్తుకొస్తున్నాయని విడతల వారీగా ప్రకటనలు గుప్పిస్తు న్నారు. తాజాగా చేసిన ప్రకటనలో రిలయన్స్‌వారు ‘కంప్రెస్డ్‌ బయోగ్యాస్‌’ ఉత్పాదన కోసం 65 వేల కోట్లు పెట్టుబడి పెడ తారనే, కళ్లు చెదిరే లెక్క కూడా చెప్పారు. అందుకోసం వారికి ఐదులక్షల ఎకరాల భూమిని అప్పగిస్తారట. ప్రతిగా కంపెనీ వాళ్లు రెండున్నర లక్షలమందికి ఉపాధి కల్పిస్తారట. అంత భూమిని పేదలకు అసైన్‌ చేస్తే అంతకంటే ఎక్కువమందే ఉపాధి పొందవచ్చు గదా అనే సందేహాలు అజ్ఞానులకు మాత్రమే కలుగుతాయి. ఆర్థిక నిపుణులు వాటికి సమాధానం చెప్పరు.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com

Telangana Government On Alert Over Hmpv Virus2
హెచ్‌ఎంపీవీ వైరస్‌పై తెలంగాణ సర్కార్‌ అలర్ట్‌

సాక్షి, హైదరాబాద్‌: HMPV (హ్యూమన్‌ మెటాఫ్యూమో వైరస్‌) వ్యాప్తిపై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. తెలంగాణలో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని వైద్యారోగ్య శాఖ తెలిపింది. భయాందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. హెచ్‌ఎంపీవీ సోకితే జలుబు, దగ్గుతో పాటు ముక్కు మూసుకుపోవడం (శ్వాస తీసుకోవడం ఇబ్బందికరంగా మారడం), ముక్కుకారడం, గొంతు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయని.. ఇది కొందరిలో ఊపిరితిత్తులను కూడా దెబ్బతీసే ప్రమాదం ఉందని వైద్యారోగ్య హెచ్చరించింది.హెచ్ఎంపీవి వైరస్ కారణంగా తీవ్ర జ్వరం, చర్మంపై దద్దుర్లు (స్కిన్ ఇన్ఫెక్షన్) కూడా వచ్చే అవకాశాలు ఉంటాయని.. జలుబు, దగ్గు, జ్వరం, చర్మ సమస్యలతో బాధపడేవారు నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని సూచించింది. ఇమ్యూనిటీ సిస్టం బలహీనంగా వుండే చిన్నారులు, వృద్ధులు మరింత జాగ్రత్తగా ఉండాలని అధికారులు తెలిపారు.ఇదీ చదవండి: HMPV Virus : ఆందోళన అవసరంలేదంటున్నభారత హెల్త్‌ ఏజెన్సీకరోనా మాదిరిగానే ఈ HMPV వైరస్ కూడా ఒకరి నుండి ఒకరికి సోకుతుంది. గాలి ద్వారా ఇది వ్యాపిస్తుంది. కాబట్టి కరోనా సమయంలో ఉపయోగించిన జాగ్రత్తలు పాటించాలని సూచించింది. అనారోగ్య సమస్యలతో రద్దీ ప్రాంతాలకు వెళ్లడంవల్ల ఇతరులు కూడా అనారోగ్యం బారినపడే అవకాశాలు ఉన్నాయని.. జన సామర్త్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో తిరిగితే HMPV వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదముందని.. చేతులు శుభ్రంగా ఉంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

Chandrababu Govt Delay In Payment Of Salaries To Government Teachers3
ఏపీలో ప్రభుత్వ టీచర్లకు అందని జీతాలు

సాక్షి, విజయవాడ: ఏపీలో ప్రభుత్వ టీచర్ల (Government teachers)కు జీతాలు అందలేదు. 4వ తేదీ వచ్చిన కూడా ఉపాధ్యాయులకు చంద్రబాబు సర్కార్‌ (Chandrababu Govt) జీతాలు చెల్లించలేదు. ప్రతి నెలా 1వ తేదీన జీతాలు(Salaries) ఇస్తామని మేనిఫెస్టోలో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. రూ.5 వేల కోట్లు అప్పు తెచ్చి కూడా టీచర్లకి కూటమి ప్రభుత్వం జీతాలు చెల్లించలేదు. ప్రభుత్వ తీరుపై టీచర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలు, పెన్షన్లు చెల్లిస్తామని చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం. దాన్ని ఒక్క నెల ముచ్చటగా మార్చేసింది. తొలి నెల మినహా తర్వాత నెల నుంచి ఒకటో తేదీన ఉద్యోగులందరికీ జీతాలు, పెన్షనర్లు అందరికీ పెన్షన్లు జమ చేయడం లేదు. నూతన సంవత్సరంలోనూ నాలుగో తేదీ వచ్చినప్పటికీ వేతనాల కోసం సుమారు రెండు లక్షల మంది ఉపాధ్యాయులు ఎదురుచూపులు చూస్తున్నారు. ఉపాధ్యాయులతోపాటు పలు శాఖల్లోని ఉద్యోగులకు ఈ నెల ఒకటో తేదీన వేతనాలు అందలేదు.ఇదీ చదవండి: ‘చంద్రబాబుగారూ.. ఇంత ద్రోహమా? ఇంతటి బరితెగింపా?’రెండో తేదీ కొంత మంది ఉద్యోగులకు వేతనాలను ప్రభుత్వం జమ చేయగా, అయితే 4వ తేదీ కూడా ఉపాధ్యాయులు ఎవరికీ జీతాలు అందలేదు. జీతాల కోసం ప్రతి నెలా ఎదురుచూపులు తప్పడం లేదని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. గత నెల కూడా ఉపాధ్యాయులకు ఒకటో తేదీన వేతనాలు జమచేయలేదు. ప్రతి నెలా 6, 7 తేదీల వరకు జీతాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి.

Cm Revanth Reveals Telangana Cabinet Decisions4
రైతు భరోసాపై సీఎం రేవంత్‌ కీలక ప్రకటన

సాక్షి, హైదరాబాద్‌: వ్యవసాయ యోగ్యమైన భూములన్నిటికీ రైతు భరోసా ఇస్తామని.. గత ప్రభుత్వం ఏడాదికి రూ.10 వేలు ఇస్తే.. తమ ప్రభుత్వం ఏడాదికి రూ.12 వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ సచివాలయంలో సీఎం మాట్లాడుతూ.. కేబినెట్‌ భేటీలో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు.భూమిలేని వ్యవసాయ కుటుంబాలకూ ప్రతి ఏడాది రూ.12 వేలు ఇస్తామని రేవంత్‌ తెలిపారు. రేషన్‌కార్డు లేని వారందరికీ కొత్త రేషన్‌ కార్డులు ఇవ్వాలని నిర్ణయించాం. జనవరి 26 నుంచి ఈ పథకాలన్నీ ప్రారంభం కాబోతున్నాయి. జనవరి 26కి ఒక ప్రత్యేకత ఉంది. అందుకే ఆరోజును మేం ఎంచుకున్నాం. రాళ్లు, రప్పలు, రోడ్లు, రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లుగా మారిన భూములకు రైతు భరోసా ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వబడదు. గ్రామాల వారీగా రెవెన్యూ అధికారులు సమాచారం సేకరించి ప్రజలకు అన్నివిషయాలు వివరిస్తారు.’’ అని రేవంత్‌ చెప్పారు.కేబినెట్‌ కీలక నిర్ణయాలువ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసాప్రతి ఎకరాకు రూ.12 వేలు ఇచ్చేందుకు కేబినెట్‌ ఆమోదంభూమి లేని వ్యవసాయ కుటుంబాలకు కూడా ఏటా రూ.12 వేలుసంక్రాంతి నుంచి కొత్త రేషన్‌కార్డుల జారీరైతు భరోసాకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాగా నామకరణంజనవరి 26 నుంచి కొత్త రేషన్‌కార్డుల జారీములుగు మున్సిపాలిటీకి కేబినెట్‌ ఆమోదంపంచాయతీ రాజ్‌లో 588 కారుణ్య నియామకాలకు ఆమోదం200 కొత్త గ్రామ పంచాయతీలకు కేబినెట్‌ ఆమోదంమరో 11 కొత్త మండలాలకు కేబినెట్‌ ఆమోదంఇదీ చదవండి: ఇకపై ప్రతి సోమవారం.. హైడ్రా కీలక నిర్ణయం

Delhi Assembly Elections: BJP Parvesh Verma Hopes Kejriwal wont run away from the seat5
‘కేజ్రీవాల్‌.. అక్కడ నుంచి పారిపోరనే ఆశిస్తున్నా’

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో(Delhi Assembly Elections) భాగంగా మాజీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌పై బీజేపీ తరఫున మాజీ ఎంపీ పర్వేష్‌ వర్మ(Parvesh Verma) పోటీకి సన్నద్ధమవుతున్నారు. ఈరోజు(శనివారం) బీజేపీ విడుదల చేసిన తొలి జాబితాలో పర్వేష్‌ వర్మకు చోటు దక్కింది. కేజ్రీవాల్‌కు పోటీగా మాజీ ఎంపీ పర్వేష్ వర్మను పేరును ప్రకటించింది బీజేపీ.ఈ సందర్భంలో కేజ్రీవాల్‌(Arvind Kejriwal)పై తనదైన శైలిలో సెటైర్లు వేశారు పర్వేష్‌ వర్మ. తనను చూసి ఢిల్లీ సీటు నుంచి కేజ్రీవాల్‌ పారిపోడనే ఆశిస్తున్నా. తాను న్యూఢిల్లీలోని చాలా మంది ప్రజలకు ఉపాధి చూపించాలనుకుంటున్నా. అందుకోసం త్వరలో ఒక శిబిరాన్ని ఏర్పాటు చేస్తాను’ అని స్పష్టం చేశారు.కేజ్రీవాల్‌ ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో నివసించిన విలాసవంతమైన భవనం శీష్‌ మహల్‌. ఇది గత కొద్ది కాలంగా వార్తల్లో ప్రముఖంగా నిలుస్తోంది. దీనిపై ఇప్పటికే ప్రధాని మోదీ.. కేజ్రీవాల్‌పై ధ్వజమెత్తగా, తాజాగా పర్వేష్‌ వర్మ సైతం ఇదే అంశాన్ని లేవనెత్తారు.‘ఢిల్లీ ప్రజల తరఫున నేను కోరుతున్నది ఏమైనా ఉందంటే.. అది శీష్‌ మహల్‌ డోర్స్‌ ఓపెన్‌ చేయాలని అడుగుతున్నా. ఎందుకంటే అది ఢిల్లీ ప్రజల సొత్తు. అక్కడ ఏం జరిగింది అనేది ట్యాక్స్‌ పే చేస్తున్న ప్రజలు చూడాలి. దీనిపై ఢిల్లీ సీఎం అతిషికి లేఖ రాస్తున్నా’ అని పర్వేష్‌ పేర్కొన్నారు.ఇక బీజేపీ విడుదల చేసిన తొలి జాబితాలో మరో మాజీ ఎంపీ రమేష్ బిధురి పేరును ప్రకటించారు. ప్రస్తుత ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషిపై రమేష్‌ బిధురి పోటీకి దిగుతున్నారు. బీజేపీ విడుదల చేసిన తొలి జాబితాలో 29మందికి చోటు దక్కగా, మిగతా జాబితాను విడుదల చేయడానికి ఆ పార్టీ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఆప్‌ తన మొత్తం అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో కాస్త ముందంజంలో ఉంది.ఎవరీ పర్వేష్‌ వర్మ..!ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌పై పోటీకి దిగుతున్న క్రమంలో పర్వేష్‌ వర్మ ఎవరు అనే దానిపై చర్చ ,నడుస్తోంది. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సాహిబ్‌ సింగ్‌ వర్మ కుమారుడే పర్వేష్‌ వర్మ. పదేళ్ల పాటు ఎంపీగా కొనసాగారు. 2014 నుంచి 2024 వరకూ వెస్ట్‌ ఢిల్లీ ఎంపీగా సేవలందించారు. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పర్వేస్‌ 5.78 లక్షల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఢిల్లీ రాష్ట్ర చరిత్రలో ఇదే అత్యధిక మెజార్జీ కావడం విశేషం.ఇదీ చదవండి: నేను అద్దాల మేడ కట్టుకోలేదు

Bumrah Has Bowled Equivalent To 3 IPL Seasons in Current BGT injury Wasnt Surprise6
BGT: మూడు ఐపీఎల్‌ సీజన్లకు సరిపడా ఓవర్లు ఒక్కడే వేశాడు!

జస్‌ప్రీత్‌ బుమ్రా(Jasprit Bumrah)... ప్రపంచంలోని అత్యుత్తమ ఫాస్ట్‌ బౌలర్లలో ఒకడు. దిగ్గజ క్రికెటర్ల నుంచి అభిమానుల వరకు అందరూ ఇదే మాట చెబుతారనడంలో సందేహం లేదు. గత కొన్నేళ్లుగా టీమిండియా పేస్‌ దళ నాయకుడిగా కొనసాగుతున్న బుమ్రా.. బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ(Border Gavaskar Trophy) 2024-25 సిరీస్‌లోనూ భారమంతా తానే మోస్తున్నాడు. గట్టెక్కించగలిగే వీరుడు బుమ్రాఆస్ట్రేలియాతో పెర్త్‌ టెస్టులో సారథిగా భారత్‌కు భారీ విజయం అందించిన బుమ్రా.. సిడ్నీ టెస్టు సందర్భంగా మరోసారి సారథ్య బాధ్యతలు చేపట్టాడు. ఈ నేపథ్యంలో టీమిండియా అభిమానులంతా బుమ్రా నామసర్మణ చేస్తున్నారు. ఆసీస్‌తో ఆఖరి టెస్టు గండాన్ని గట్టెక్కించగలిగే వీరుడు బుమ్రా మాత్రమే అని విశ్వసిస్తున్నారు. నిజానికి.. స్వదేశంలో జరిగే సిరీస్‌లలో టీమిండియా స్పిన్నర్లదే పైచేయి గా నిలుస్తుంది. కానీ విదేశీ గడ్డపై జరిగే సిరీస్‌లలో అక్కడి పిచ్లకు అనుగుణంగా పేస్ బౌలర్లు ప్రధాన పాత్ర వహిస్తారు. అయితే ఇక్కడే టీమిండియా మేనేజ్‌మెంట్‌ ముందు చూపుతూ వ్యవహరించడంలో విఫలమైందని చెప్పవచ్చు.షమీ ఉంటే బుమ్రాపై భారం తగ్గేదిఆస్ట్రేలియా వంటి ఎంతో ప్రాముఖ్యం గల సిరీస్ ముందుగా పేస్ బౌలర్లని పదును పెట్టడంలో బోర్డు వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. సీనియర్ పేస్ బౌలర్ మహమ్మద్ షమీకి గాయంతో దూరం కావడం భారత్ జట్టుకు ప్రధాన సమస్యగా మారింది. షమీ ఎంతో అనుభవజ్ఞుడు. పైగా ఆస్ట్రేలియాలో గతంలో రాణించి తన నైపుణ్యాన్ని నిరూపించుకున్నాడు. షమీ అండగా ఉన్నట్లయితే బుమ్రా పై ఇంతటి ఒత్తిడి ఉండేది కాదన్నది వాస్తవం.గతంలో బుమ్రాతో పాటు భువనేశ్వర్ కుమార్, ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్ వంటి బౌలర్లు జట్టులో ఉన్నప్పుడు భారత్ పేస్ బౌలింగ్ పటిష్టంగా ఉండేది. మహమ్మద్ సిరాజ్ చాల కాలంగా జట్టులో ఉన్నప్పటికీ, నిలకడగా రాణించడం లో విఫలమయ్యాడనే చెప్పాలి.యువ బౌలర్లకు సరైన మార్గదర్శకత్వం ఏది?ఈ నేపధ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్‌)లో ఎంతోమంది యువ బౌలర్లు రంగ ప్రవేశం చేస్తున్నప్పటికీ వారికి సరైన తర్ఫీదు ఇవ్వడంలోనూ.. సీనియర్ బౌలర్లు గాయాల బారిన పడకుండా వారిని సరైన విధంగా మేనేజ్ చేయడంలో భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు విఫలమైంది. ఐపీఎల్ పుణ్యమా అని భారత్ క్రికెట్‌కు ప్రస్తుతం పేస్ బౌలర్ల కొరత లేదు. కానీ ఉన్నవారికి సరైన తర్ఫీదు ఇచ్చి వారు అంతర్జాతీయ టెస్టు క్రికెట్ లో రాణించే విధంగా తీర్చిదిద్దడం కచ్చితంగా బోర్డుదే బాధ్యత. ఇటీవల కాలంలో ఉమ్రాన్ మాలిక్, మయాంక్ యాదవ్, నవదీప్ సైనీ, శార్దూల ఠాకూర్, అర్షదీప్ సింగ్, వరుణ్ ఆరోన్‌, టి నటరాజన్ వంటి అనేక మంది యువ బౌలర్లు ఐపీఎల్ క్రికెట్ లో రాణిస్తున్నారు. వారికి భారత్ క్రికెట్ జట్టు అవసరాలకి అనుగుణంగా సరైన రీతిలో తర్ఫీదు ఇస్తే బాగుంటుంది.వాళ్లకు అనుభవం తక్కువఇక తాజా బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ సిరీస్‌కు బుమ్రా, సిరాజ్‌లతో పాటు ఆకాశ్‌ దీప్‌, ప్రసిద్‌ కృష్ణ, హర్షిత్‌ రాణా కూడా ఎంపికయ్యారు. అయితే, ఈ ముగ్గురూ అదనపు పేసర్లుగా అందుబాటులో ఉన్నప్పటికీ బుమ్రా, సిరాజ్‌లపైనే భారం పడింది. అయితే, సిరాజ్‌ నిలకడలేమి కారణంగా బుమ్రా ఒక్కడే బాధ్యత తీసుకోవాల్సి వచ్చింది.నిజానికి.. బుమ్రా ఈ సిరీస్ లో సంచలనం సృష్టించాడు. ఒంటి చేత్తో తొలి టెస్టులో భారత జట్టుకి విజయం చేకూర్చాడు. ఈ సిరీస్‌లో ఇంతవరకు 12.64 సగటుతో 32 వికెట్లు పడగొట్టి, ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా రికార్డ్ నెలకొల్పాడు.మూడు మార్లు ఐదు కన్నా ఎక్కువ వికెట్లు తీసుకున్నాడు. 1977-78 ఆస్ట్రేలియా పర్యటనలో బిషన్ సింగ్ బేడీ 31 వికెట్ల రికార్డును బుమ్రా ఈ టెస్ట్ మ్యాచ్‌లో అధిగమించడం విశేషం. అయితే, ఆఖరిదైన సిడ్నీ టెస్టులో భాగంగా శనివారం నాటి రెండో రోజు ఆట సందర్భంగా బుమ్రా గాయపడ్డాడు. అయితే, మైదానం నుంచి నిష్క్రమించే ముందు బుమ్రా కీలకమైన ఆస్ట్రేలియన్ బ్యాటర్ మార్నస్ లబుషేన్‌ని అవుట్ చేయడం ద్వారా ఈ రికార్డు నెలకొల్పాడు.చివరి ఇన్నింగ్స్‌లో బుమ్రా బౌలింగ్‌పై అనిశ్చితి సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (SCG)లో జరుగుతున్న ఐదవ మరియు చివరి టెస్టులో రెండో రోజు ఆటలో అసౌకర్యానికి గురైన బుమ్రా మ్యాచ్ మధ్యలో వైదొలిగాడు. బుమ్రా వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు తెలిసింది. మ్యాచ్ అనంతరం పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ మాట్లాడుతూ బుమ్రా పరిస్థితిపై వివరణ ఇచ్చాడు. బుమ్రా పరిస్థితిని భారత వైద్య బృందం నిశితంగా పరిశీలిస్తోందని పేర్కొన్నాడు. "జస్‌ప్రీత్‌ బుమ్రాకు వెన్నునొప్పి ఉంది. వైద్య బృందం అతడిని పర్యవేక్షిస్తోంది" అని వ్యాఖ్యానించాడు.3 ఐపీఎల్‌ సీజన్లకు సరిపడా ఓవర్లు వేశాడునిజానికి 2024 నుంచి ఇప్పటి దాకా(జనవరి 4) టెస్టుల్లో అత్యధిక బంతులు బౌల్‌ చేసింది బుమ్రానే. ఏకంగా 367 ఓవర్లు అంటే.. 2202 బాల్స్‌ వేసింది అతడే!.. ఈ విషయంలో బుమ్రా తర్వాతి స్థానంలో ఇంగ్లండ్‌ పేసర్‌ గస్‌ అట్కిన్సన్‌(1852 బాల్స్‌) ఉన్నాడు.ఇక బుమ్రా బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీలో ఇప్పటి వరకు 908 బంతులు వేశాడు. అంటే 151.2 ఓవర్లు అన్నమాట. ఇది ఐపీఎల్‌ మూడు సీజన్లలో ఒక బౌలర్‌ వేసే ఓవర్లకు దాదాపు సమానం. ఐపీఎల్‌లో 14 లీగ్‌ మ్యాచ్‌లు ఆడి.. ప్రతి మ్యాచ్‌లోనూ నాలుగు ఓవర్ల కోటాను బౌలర్‌ పూర్తి చేశాడంటే.. అతడి ఖాతాలో 168 ఓవర్లు జమవుతాయి. అదే.. 13 మ్యాచ్‌లు ఆడితే 156 ఓవర్లు. అదీ సంగతి. ఇంతటి భారం పడితే ఏ పేసర్‌ అయినా గాయపడకుండా ఉంటాడా? ఇందుకు బోర్డు బాధ్యత వహించనక్కర్లేదా?!చదవండి: నిజమైన నాయకుడు.. అసలైన లెజెండ్‌: సురేశ్‌ రైనా

YS Jagan Angry on Chandrababu Govt7
‘చంద్రబాబుగారూ.. ఇంతటి బరితెగింపా?’

గుంటూరు, సాక్షి: హామీల అమలులో అలసత్వం.. నిర్లక్ష్యం.. ఎగవేత ధోరణి ప్రదర్శిస్తున్న కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి(YS Jagan Mohan Reddy) ధ్వజమెత్తారు. తాజాగా తల్లికి వందనం ఎగవేత కూటమి సర్కార్‌ను నిలదీస్తూ ఎక్స్‌ ఖాతాలో ఆయన సుదీర్ఘంగా ఓ సందేశం ఉంచారు. ‘‘ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలపై ఇంతటి బరితెగింపా? మేనిఫెస్టోపై ఇంతటి తేలిక తనమా? ప్రజలకు ఇచ్చిన మాటను అమలు చేయకుండా టేక్‌ ఇట్‌ గ్రాంటెడ్‌గా తీసుకుంటారా? లక్షలమంది తల్లులకు, పిల్లలకు, రైతులకు ఇంతటి ద్రోహం తలపెడతారా?. అధికారంలోకి వస్తే తల్లికి వందనం అని, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ ఏడాదికి రూ.15వేలు చొప్పున ఇస్తామన్నారు, అధికారంలోకి రాగానే అంతకుముందు మేం ఇస్తున్న అమ్మ ఒడి పథకాన్ని సైతం ఆపేశారు... వరుసగా కేబినెట్‌(Cabinet) సమావేశాలు జరుగుతున్నాయి కాని, తల్లికి వందనం పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారో నిర్దిష్టంగా చెప్పలేదు. తీరా ఈ ఏడాదికి ఇవ్వమని కేబినెట్లో తేల్చిచెప్పేశారు. ఇంతకన్నా మోసం ఏమైనా ఉంటుందా? ఇంతకన్నా పచ్చి దగా ఏమైనా ఉంటుందా?. చంద్రబాబుగారూ… ఎన్నికల వేళ మీరు, మీ కూటమి నాయకులు రాష్ట్రంలోని ప్రతిచోటా తల్లికి వందనంపై చేసిన ప్రచారం అంతా ఇంతాకాదు. ఇంటింటికీ తిరిగి కనిపించిన ప్రతి పిల్లాడినీ పట్టుకుని నీకు రూ.15వేలు, నీకు రూ.15వేలు, నీకు రూ.15వేలు అన్నారు. ఇద్దరుంటే రూ.30వేలు ఇస్తామన్నారు, ముగ్గురు ఉంటే రూ.45వేలు ఇస్తామన్నారు. నలుగురు ఉంటే రూ.60వేలు ఇస్తామన్నారు. ప్రజలకు మీరుచేసిన వాగ్దానం, మీరు చెప్పిన మాటలు ఆడియో, వీడియోల రూపంలో సాక్ష్యాధారాలుగా ప్రతిఒక్కరి సెల్‌ఫోన్‌లో ఉన్నాయి. వైఎస్సార్‌సీపీ(YSRCP) హయాంలో 44.48 లక్షల మంది తల్లులకు, దాదాపు 84 లక్షల మంది పిల్లలకు, రూ.26,067 కోట్లను మేము అందించి, అత్యంత విజయవంతంగా అమలుచేసిన అమ్మ ఒడిని ఆపేసినా, మీరు ఇస్తామన్న పథకం వస్తుందేమోనని బడికి వెళ్లే ఆ పిల్లలు, వారి తల్లులు ఈ 7-8నెలలుగా ఎదురుచూస్తూనే ఉన్నారు. చివరకు వారి ఆశలపై నీళ్లు జల్లి, ఈ ఏడాది ఇవ్వమని నిస్సిగ్గుగా చెప్తున్నారు. ప్రజలకు ఒక మాట ఇచ్చి, దాన్ని నమ్మించి, వారి ద్వారా అధికారాన్ని తీసుకుని, ఇప్పుడు ఇవ్వలేమంటూ ఎలాంటి సంకోచంలేకుండా చెప్తున్నారు. మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేయడం, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కడం మీకు అలవాటుగా మారిపోయింది చంద్రబాబుగారూ…?.. ఇక రైతు భరోసా(Rythu Bharosa) తీరు కూడా అలానే ఉంది. ఈ ఏడాది ఖరీఫ్‌, రబీ రెండు సీజన్లు అయిపోతున్నా ఇవ్వకుండా గడిపేశారు. అదిగో, ఇదిగో అంటూ లీకులు ఇస్తున్నారు కాని, ఇప్పటివరకూ రైతులకు పెట్టుబడి సహాయం కింద ఒక్కపైసా ఇవ్వలేదు. అధికారంలోకి వచ్చిన ఆ ఏడాదే 2019 అక్టోబరులో ప్రారంభమై, అప్పటినుంచి క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం రూ.13,500 చొప్పున 53.58 లక్షల రైతుల చేతిలో, రూ.34,378కోట్లు మేము పెట్టాం. కేంద్రం ఇచ్చేది కాకుండా మీరు ఏడాదికి రూ.20వేలు ఇస్తామన్నారు. ఇప్పుడు ఖరీఫ్ అయిపోయిందీ, రబీకూడా అయిపోయింది. ఒక్కపైసా ఇవ్వలేదు. ఇన్ని కేబినెట్‌ మీటింగ్‌లు పెట్టుకున్నా… ఎప్పుడు ఇస్తామో చెప్పడంలేదు. ఇది రైతులను నిలువెల్లా మోసం చేయడం కాదా? రైతులకు పెట్టుబడి సహాయం లేదు, కనీస మద్దతు ధరా అందడంలేదు, ఉన్న ఉచిత పంటలబీమాను రద్దుచేశారు, ఆర్బీకేలను నిర్వీర్యంచేశారు. సంక్షోభంలో ఎవరైనా రైతులు దురదృష్టవశాత్తూ ఆత్మహత్య చేసుకుంటే కనీసం ఆ కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందడంలేదుకదా, కనీసం పరామర్శకు కూడా నోచుకోవడం లేదు... ప్రతి పిల్లాడికి రూ.15వేలు చొప్పున ఎంతమంది పిల్లలు ఉంటే, అంతమందికీ అన్న తల్లికి వందనం అయినా మోసమే, రైతులకు పెట్టుబడి సాయంగా రూ.20వేలు ఇస్తామన్నదీ మోసమే, 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకూ రూ.18వేలు అయినా మోసమే, నిరుద్యోగభృతి కింద ప్రతి పిల్లాడికీ రూ.36వేలు అయినా మోసమే, 50 సంవత్సరాలు నిండిన ప్రతి అక్కకూ రూ.48వేలు అయినా మోసమే, ఇంటింటికీ సేవలు అందిస్తూ మంచికి అర్థం చెప్పిన వాలంటీర్లకూ మీరు చేసింది మోసమే, ఈ మోసాలు అన్నింటికీ తోడు, మీ పాలనలో ప్రజలపై ఛార్జీలతో బాదుడే బాదుడు కనిపిస్తోంది. ప్రతి అడుగులోనూ స్కాంలే. ఇసుకను వదలడంలేదు, మద్యాన్ని వదలడంలేదు. చంద్రబాబుగారూ.. రోజులు గడుస్తున్నకొద్దీ, మీరు చేస్తున్న మోసాలు ఒక్కొక్కటీ బయటకు వస్తూనే ఉన్నాయి. ఇవి ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీస్తున్నాయి. ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రజల పక్షాన నిలబడి, వారి గొంతుకై నిలుస్తుంది. ప్రజలకు మీరు ఇచ్చిన వాగ్దానాల అమలుకోసం వారి తరఫున నిలబడుతుంది’’ అని పేర్కొన్నారాయన. చదవండి👉: బలవంతంగా ఏపీ రాజకీయాలను అందులో ఇరికించారా?

Pavithra Gowda Daughter Kushi: My Mother Has Never Hurt Anyone8
మా అమ్మ ఎవర్నీ గాయపర్చలేదు, ఈ భారం మోయలేకున్నా!: పవిత్ర కూతురు

అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ హీరో దర్శన్‌ (Darshan), అతడి ప్రియురాలు పవిత్ర గౌడ (Pavithra Gowda) కొన్ని నెలలపాటు జైలు జీవితం గడిపారు. కొద్ది రోజుల క్రితమే ఇద్దరూ బెయిల్‌పై బయటకు వచ్చారు. అయితే ఆ సంఘటన జరిగినప్పటి నుంచి ఇప్పటికీ వీరిద్దరిపై సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ జరుగుతూనే ఉంది. దీనిపై పవిత్ర గౌడ కూతురు ఖుషి గౌడ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా ఓ పోస్ట్‌ పెట్టింది. ఇలాంటి పోస్ట్‌ ఒకటి పెట్టాల్సి వస్తుందని నేను ఎన్నడూ అనుకోలేదు. కానీ మీ మాటలు మా మనసుకు గాయం చేస్తున్నాయి. దాన్ని అలాగే వదిలేయలేకపోతున్నాను.మీకేం తెలుసు?అర్థం పర్థం లేకుండా, మీకు మీరే అన్నీ నిర్ధారించేసుకుంటూ మా అమ్మ గురించి క్రూరంగా మాట్లాడుతున్నారు. అవి నా మనసును ఎంత బాధిస్తున్నాయో మీకేం తెలుసు? తను పడ్డ కష్టాలు, చేసిన త్యాగాలు మీకు తెలియదు. మీ సూటిపోటి మాటలపై తను నిశ్శబ్ధంలోనే పోరాటం చేస్తోంది. తన చుట్టూ ఉన్న ప్రపంచం కుప్పకూలిపోతుంటే కూడా ధైర్యంగా నిలబడింది. మా అమ్మే నా ప్రపంచం, బలం, ఇన్‌స్పిరేషన్‌. తను నాకు అమ్మ మాత్రమే కాదు నాన్న కూడా! నా జీవితంలో అన్ని పాత్రలు తనే పోషించింది. ఆవిడే నా సర్వస్వం.(చదవండి: గేమ్‌ ఛేంజర్‌ ఈవెంట్‌కు హీరోయిన్‌ డుమ్మా.. ఎందుకంటే?)అదే నన్నింకా బాధిస్తోంది!మా అమ్మ.. ప్రేమ, త్యాగానికి నిలువెత్తు నిదర్శనం. తన గురించి నేనెంత చెప్పినా తక్కువే! ఆవిడ గురించి తెలుసుకోకుండా తప్పుగా మాట్లాడటం అన్యాయం, దారుణం. నన్నింకా బాధిస్తుందేంటో తెలుసా? ఇప్పటికీ తనను ద్వేషిస్తున్నారు. తను అంత బాధ (జైలు జీవితం) అనుభవించినా కూడా ఇప్పటికీ తనను కాల్చుకు తింటున్నారు. నేను టీనేజర్‌ను. మీ అసహ్యకరమైన కామెంట్లు నన్నెంత బాధిస్తున్నాయో తెలుసా! మా అమ్మను దోషిగా నిలబెట్టారు. ఈ భారాన్ని నేను మోయలేకున్నాను.మా అమ్మ హీరోమా అమ్మ ఎప్పుడూ ఎవరినీ గాయపర్చలేదు. ఒక్కసారి కూడా తను ఎవర్నీ బాధపెట్టలేదు. పైగా తన సొంత ఖర్చులతో వేరేవారి బాగోగులు కూడా చూసుకునే మంచి మనిషి. అలాంటి తనపై మనసు లేని మనుషులు ఇంకా బురద చల్లాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. బాధగా ఉంది. తనకిలాంటి పరిస్థితి వచ్చినందుకు మరింత బాధగా ఉంది. మా అమ్మ ఉత్తమురాలు. ఏం జరిగినా నేను తన వెంటే ఉంటాను. దయచేసి ముందూవెనకా ఆలోచించి మాట్లాడండి. మా అమ్మ నాకు హీరో.. దాన్నెవరూ మార్చలేరు అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది.అభిమాని హత్యకాగా పవిత్ర గౌడకు అసభ్య సందేశాలు పంపాడన్న కారణంతో కర్ణాటకకు చెందిన రేణుకాస్వామి (Renuka Swamy Murder Case)ని హీరో దర్శన్‌ చంపారంటూ ఆరోపణలు వచ్చాయి. ఈమేరకు కొన్ని సాక్ష్యాలు సేకరించిన పోలీసులు గతేడాది జూలైలో దర్శన్‌, పవిత్రగౌడను అరెస్టు చేశారు. ఇటీవలే వీరు బెయిల్‌పై బయటకు వచ్చారు.చదవండి: టీవీలో నాన్నను చూసి మురిసిపోయిన క్లీంకార..వీడియో వైరల్‌

Ex Minister Ktr Slams On Cm Revanth Reddy9
చిట్టినాయుడు కేసులకు భయపడం: కేటీఆర్‌

సాక్షి, రాజన్న సిరిసిల్ల జిల్లా: ఆరు గ్యారెంటీల్లో అర గ్యారెంటీ మాత్రమే అమలైందని.. రేవంత్‌కు పరిపాలన చేతకావడం లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ విమర్శలు గుప్పించారు. రైతు బంధుకు కొర్రీలు పెడుతున్నారన్న కేటీఆర్‌.. సీఎం రేవంత్‌రెడ్డిని కటింగ్‌ మాస్టర్‌గా అభివర్ణించారు. శనివారం.. సిరిసిల్ల బీఆర్ఎస్ కార్యాలయంలో ముఖ్య నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఈ భేటిలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు దాసరి మనోహర్ రెడ్డి, కోరుకంటి చందర్, పుట్టమధు, తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. ‘‘రూ.2 లక్షల రుణమాఫీ అయ్యిందా? లేదా తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి ఊరికి పోదామా అంటూ అసెంబ్లీలో అడిగితే సమాధానం లేదు. సర్వశిక్షా అభియాన్ వాళ్ల సమస్యను అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామన్నాడు రేవంత్.. ఏమైంది?. కాంగ్రెస్ మాట తప్పిన ప్రభుత్వం. ఎప్పుడైనా నాట్లు పడేటప్పుడు పడాల్సిన రైతుబంధు.. ఓట్లు పడ్డప్పుడు వేసిన ఘనత కాంగ్రెస్‌ది. రైతు ప్రమాణ పత్రం రాయడమేంటి..?’’ అంటూ కేటీఆర్‌ నిలదీశారు.ఇదీ చదవండి: పదో ర్యాంకు వచ్చినా.. ఉద్యోగం ఇస్తలేరు..‘‘లక్షా 20 వేల కోట్ల రూపాయలు 70 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశారు కేసీఆర్. రైతును బద్నాం చేసే మాట, దొంగగా చిత్రీకరించేలా ఏడు వేల కోట్ల రూపాయలు మళ్లించారని మాట్లాడిండు రేవంత్. రెండో పంట వేయని రైతులను తప్పుగా చిత్రీకరిస్తోంది రేవంత్ ప్రభుత్వం. టీచర్ అయితే రైతుబంధు కట్ అంటుండు రేవంత్. ఇప్పుడు సీఎం అంటే కటింగ్ మాస్టర్’’ అని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు.‘‘పర్రె మేడిగడ్డకు పడలే.. రేవంత్ పుర్రెకు పడ్డది. మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో కాంగ్రెసే ఏదో దొంగచాటుగా చేస్తోందనేది నా అనుమానం. స్థానిక సంస్థల ఎన్నికల సంవత్సరం కాబోతోంది ఈ ఏడాది. కాబట్టి ప్రేక్షకపాత్రకు పరిమితం కాకుండి. కేసులైనా భయపడకండి. చిట్టినాయుడు ఏం పీకలేడు. చిల్లర మిల్లర రాతలు రాయించేవారినీ వదిలిపెట్టం. బాక్సింగ్‌లో కిందపడ్డా నిలబడి కొట్లాడేటోడే వీరుడు. కాంగ్రెస్ 8, బీజేపీ 8 ఎంపీలైన్రు కానీ వచ్చింది గుండు సున్నా. కేసీఆర్ ఒక రోజు దేశంలో చక్రం తిప్పే రోజు ముందుంది..కాంగ్రెస్ నాడు బీఆర్ఎస్ ప్రభుత్వానికి 369 కోట్ల రెవెన్యూ మిగులుతో అప్పజెప్పితే.. మనం దిగిపోయేనాడు 5 వేల 564 కోట్ల మిగులుతో కాంగ్రెస్‌కు అప్పజెప్పాం. రెవెన్యూ మిగులు విషయంలో ముఖ్యమంత్రిదో మాట, ఉప ముఖ్యమంత్రిదో మాట. పదేళ్లలో 4 లక్షల 17 వేల కోట్లు మనం అప్పు చేస్తే.. కాంగ్రెస్ ఒక ఏడాదిలో 1 లక్షా 37 వేల కోట్ల అప్పుజేసింది. మేం చేసిన అప్పుల వల్ల జరిగిన అభివృద్ధి గురించి మేం చెప్తాం.. మీరు చెప్పగలరా?. హైడ్రా పేరిట పేదల పొట్ట కొట్టడం తప్ప ఏం చేసింది ఈ ప్రభుత్వం?. ఢిల్లీకి పంపుతున్నారు పైసలన్నీ. తెలంగాణా ఢిల్లీకి ఏటీఎం అయిపోయింది.కొడంగల్ భూములివ్వని కేసులో కూడా నన్ను ఇరికించే యత్నం చేశాడు. ఆరు కేసుల్లో ఎలా ఇరికిద్దామా అనే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వానిది. వాళ్లు కేసుల గురించి ఆలోచించని.. మనం రైతుల గురించి ఆలోచిద్దాం. త్వరలో సభ్యత్వ నమోదు ప్రారంభించి బూత్ కమిటీ నుంచి రాష్ట్ర కమిటీలు వేసుకుందాం. రైతుభరోసాపై గ్రామాల్లో నాయకులంతా చర్చ పెట్టాలి. కోటి ఆరు లక్షల మంది నుంచి దరఖాస్తులు తీసుకుని ఏం చేసినట్టు?. మళ్ళీ ప్రమాణపత్రాలెందుకు?’’ అంటూ కేటీఆర్‌ విమర్శించారు.

Students Protest At Mahabubnagar Polytechnic College10
TG: మరో ఘటన.. వాష్‌రూమ్‌లో వీడియో రికార్డింగ్..

సాక్షి, మహబూబ్‌నగర్: జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల టాయిలెట్‌లో అమ్మాయిల వీడియోలు చిత్రీకరించడం కలకలం రేపుతుంది. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ ఏబీవీపీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. దీంతో కాలేజీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇవాళ కళాశాలలో పరీక్ష రాసేందుకు వచ్చిన నక్క సిద్ధార్థ అనే థర్డ్ ఇయర్ విద్యార్థి.. అమ్మాయిల టాయిలెట్ గోడపై సెల్ ఫోన్ నుంచి వీడియోలు చిత్రీకరించాడు దీన్ని గమనించిన ఓ విద్యార్థిని విషయాన్ని కళాశాల సిబ్బందికి తెలిపింది.వెంటనే ఆ ఫోను స్వాధీనం చేసుకున్న ప్రిన్సిపల్ షీ టీమ్స్‌కు సమాచారం ఇచ్చారు పరీక్ష పూర్తయిన ఆ విద్యార్థి తన సెల్ ఫోన్‌ చోరీకి గురైనట్టు ఫిర్యాదు చేయడం ఆశ్చర్యాన్ని గురిచేసింది అనుమానించిన ప్రిన్సిపల్ అతన్ని బయటకు వెళ్లకుండా అక్కడే ఉంచుకొని పోలీసులకు అప్పగించారు. అయితే నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు.గతంలో కూడా ఇలాంటి ఘటన జరిగితే తాము ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.భవిష్యత్తులో ఇలాంటి ఘటన జరగకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. విద్యార్థులు మాత్రం తమకు న్యాయం చేయాలని ఆ వీడియోలు ఏం రికార్డయిందనే అనే విషయంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విషయం తనకు తెలిసిన వెంటనే సెల్ ఫోన్ స్వాధీనం చేసుకొని పోలీసులకు అప్పగించినట్టు చెప్తున్నారు. మొత్తంగా కళాశాల టాయిలెట్‌లలో జరిగిన వీడియో చిత్రీకరణ ఇప్పుడు సంచలనంగా మారింది.ఇదీ చదవండి: పోలీస్‌స్టేషన్‌లో మహిళతో నీచ కృత్యం.. డీఎస్పీ అరెస్ట్‌

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

International View all
title
ఏకంగా 174 కిలోల బరువు తగ్గాడు, చివరకు..

మనిషి కాస్త లావుగా ఉంటే.. బాడీ షేమింగ్‌ చేస్తూ హేళన చేసే సమాజం ఇది. అయితే తమ కొవ్వును కరిగించుకుని..

title
తడబడ్డ కమలాహారిస్‌..వీడియో వైరల్‌

వాషింగ్టన్‌:అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహారిస్‌ తడబడ్డారు.

title
ప్రధానిపై విమర్శలు..మస్క్‌కు బ్రిటన్‌ కౌంటర్‌

లండన్‌:బ్రిటన్‌(Britain) ప్రధాని కీర్‌ స్టార్మర్‌(Keir Starm

title
మద్యపానం క్యాన్సర్‌కు కారకం: అమెరికా సర్జన్ జనరల్ వివేక్ మూర్తి హెచ్చరిక

ప్రపంచవ్యాప్తంగా మద్యపానం చేసేవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

title
World Braille Day: బ్రెయిలీ లిపి అంటే ఏమిటి? ఎలా ఆవిష్కృతమయ్యింది?

అంధులు.. దృష్టిదోషమున్నా మనసుతో లోకాన్ని చూసేవారు.

NRI View all
title
భావ వైవిధ్యం.. అన్నమయ్య సంకీర్తనా గానంపై నాట్స్ వెబినార్

title
అమెరికాలోనూ ‘చాయ్‌.. సమోసా’

‘తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ’ అంటూ భారతీయ పర్యాటకులను మరింతగా ఆకట్టుకునేం

title
న్యూ ఇయర్‌ వేళ విషాదం : భారత సంతతి వైద్యుడు దుర్మరణం

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) దేశంలో దుబాయ్ ఎమిరేట్,  రాస్ అల్ ఖైమాలో  జరిగిన చిన్న ప్రైవేట్  విమాన ప్రమ

title
మహిళా క్యాషియర్‌పై దాడి, అనుచిత వ్యాఖ్యలు, ఎన్‌ఆర్‌ఐకు జైలు, జరిమానా

మహిళా క్యాషియర్‌పై అనుచితంగా ప్రవర్థించిన భారత సంతతికి చెందిన  27 ఏళ్ల వ్యక్తికి  సింగపూర్‌  కోర్టు జైలు

title
సుచీర్‌ బాలాజీ కేసులో షాకింగ్ ‌ట్విస్ట్‌!

ఓపెన్‌ఏఐ విజిల్‌బ్లోయర్‌

Advertisement

వీడియోలు

Advertisement