పేట్ బషీరాబాద్ లో రోడ్డు ప్రమాదం
విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న ద్విచక్ర వాహనం
కుత్బుల్లాపూర్: ఇటీవల కొత్తగా బైక్ కొన్న ఓ యువకుడు.. దానిపై మరో స్నేహితుడిని తీసుకుని వెళ్లి.. మిత్రులను కలిసి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇరువురూ అసువులు బాశారు. ఈ దుర్ఘటన శనివారం తెల్లవారుజామున పేట్‌బష్‌రాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. గుండ్లపోచంపల్లికి చెందిన దొంతిరి కార్తీక్‌రెడ్డి (26) అనే యువకుడు ప్రైవేట్ ఉద్యోగి. ఇతను ఈ మధ్య రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ను కొన్నాడు. ఈ క్రమంలో తన స్నేహితుడు ఆరుద్ర అనిల్ (21)తో కలిసి సెంట్రల్ పార్క్‌లో ఉన్న మిత్రులు రాకేష్, నరేష్ వద్దకు శుక్రవారం రాత్రి వెళ్లారు.
శనివారం వేకువజామున సుమారు 2 గంటల ప్రాంతంలో గుండ్లపోచంపల్లికి తిరుగు పయనమయ్యారు. వీరు వస్తున్న బైక్.. కృష్ణ ట్రేడర్స్ ఏజీ ల్యాండ్ సమీపంలోకి రాగానే అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో కార్తీక్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. అనిల్‌కు తీవ్ర గాయాలు కావడంతో స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ అనిల్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు చెబుతున్నారు.
ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో..
అంతకుముందు బైక్‌పై వెళ్లిన ఇద్దరు స్నేహితులు ఇంటికి సక్రమంగా వెళ్లారా.. లేదా..? అని తెలుసుకునేందుకు స్నేహితుడు నరేష్ వీరికి ఫోన్ చేయగా ఎంతకు లిఫ్ట్ చేయలేదు. దీంతో అనుమానం వచి్చ న నరే‹Ù.. కార్తీక్‌రెడ్డి, అనిల్ కోసం వెళ్తుండగా రోడ్డు పై ఇద్దరు యువకులు పడి ఉన్న విషయాన్ని గుర్తించాడు. కార్తీక్‌రెడ్డి విగతజీవిగా పడి ఉండటం.. అనిల్ తీవ్ర గాయాలతో ఉండటాన్ని గమనించి కార్తీక్‌రెడ్డి తండ్రి నరసింహారెడ్డికి ఫోన్ చేసి పరిస్థితిని వివరించాడు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందడంతో రెండు కుటుంబాల్లో విషాదం అలముకుంది. మృతుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment