సెల్ ఫోన్ కోసం .. ప్రాణం తీసుకున్న ఇంటర్మీడియట్‌ విద్యార్థి | A Student Hangs Himself For Cell Phone At West Godavari | Sakshi
Sakshi News home page

సెల్ ఫోన్ కోసం .. ప్రాణం తీసుకున్న ఇంటర్మీడియట్‌ విద్యార్థి

Published Wed, Jul 28 2021 9:10 PM | Last Updated on Wed, Jul 28 2021 9:14 PM

A Student Hangs Himself For Cell Phone At West Godavari - Sakshi

సాక్షి,అనంతపురం(కుందుర్పి): సెల్‌ఫోన్‌ ఇవ్వకపోవడంతో మనస్థాపం చెందిన ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... కుందుర్పి మండలం తెనగల్లు గ్రామానికి చెందిన నగేష్‌ కుమారుడు అజిత్‌ (17) ఇంటర్మీడియట్‌ చదువుకుంటున్నాడు. కోవిడ్‌ నేపథ్యంలో కళాశాల తెరవకపోవడంతో పుస్తకాలు పక్కన పెట్టేసి సెల్‌ఫోన్‌లో గేమ్స్‌ ఆడేందుకు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయమే సెల్‌ఫోన్‌ తీసుకుని ఆడుకోవడం మొదలు పెట్టాడు. ఆ సమయంలో తండ్రి మందలించాడు. చదువులపై దృష్టి పెట్టాలంటూ హితవు పలికారు. దీంతో మనస్థాపం చెందిన అజిత్‌.. గ్రామ శివారులోని చెట్టుకు ఉరి వేసుకున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు సీఐ గణేష్‌ తెలిపారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement