కబడ్డీ మ్యాచ్‌లకు అంపైర్‌గా మురళీ కుమార్
సామర్లకోట: ఆస్ట్రేలియాలో ఈ నెల 28 నుంచి జరగనున్న ప్రో కబడ్డీ పోటీలకు బోగిళ్ల మురళీ కుమార్ అంపైర్‌గా ఎంపికయ్యారు. సామర్లకోటకు చెందిన ఆయన ఇండియాలో జరిగిన ప్రో కబడ్డీ మ్యాచ్‌లకు వరసగా పదిసార్లు అంపైర్‌గా వ్యవహరించారు. ప్రొ కబడ్డీ లీగ్ మ్యాచ్‌లు ముగియడం, 26 నుంచి సెమీఫైనల్ మ్యాచ్‌లు ప్రారంభం కావడంతో బుధవారం పూణే నుంచి ఆస్ట్రేలియా బయలు దేరారు. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో డిసెంబర్ 28 నుంచి ఇండియా, ఆస్ట్రేలియా లెజండర్స్ మధ్య కబడ్డీ మ్యాచ్‌లు జరగనున్నాయి. కాగా. మురళీకుమార్ ఆస్ట్రేలియాలో కబడ్డీ మ్యాచ్‌లకు అంపైర్‌గా వెళ్లడంపై జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు కొండపల్లి శ్రీనివాసు, కోశాధికారి నిమ్మకాయల కిరణ్, ఉపాధ్యక్షుడు తాళ్లూరి వైకుంఠం, సభ్యులు, జాతీయ కోచ్ పోతుల సాయి ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. మురళీకుమార్ పీఈటీగా సామర్లకోటలో పనిచేసిన సమయంలో ఎస్‌బీఎస్‌ఆర్ క్లబ్‌ను ఏర్పాటు చేసి కబడ్డీ శిక్షణ ఇస్తున్నారు. ప్రస్తుతం జగ్గంపేట జిల్లా పరిషత్ హైస్కూల్లో ఫిజికల్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment