సైన్స్ ఫెయిర్ లోగో ఆవిష్కరణ
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): స్థానిక సత్యసాయి గురుకులంలో జనవరి 4వ తేదీన నిర్వహించే జిల్లాస్థాయి సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్‌ను విజయవంతం చేయాలని జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారి కంది వాసుదేవరావు అన్నారు. కోటగుమ్మం వద్ద ఉన్న జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో సోమవారం కమిటీ సభ్యులతో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ మండల స్థాయి నుంచి ఎంపికై న ప్రదర్శనలను సమయానికి వాటికి కేటాయించిన గదులలో చేరేలా చూడాలన్నారు. విద్యుత్‌తో పనిచేసే నమూనాలకు సంబంధించిన ఏర్పాట్లను ముందుగానే చూసుకోవాలన్నారు. అనంతరం సైన్స్ ఫెయిర్ లోగో ఆవిష్కరించారు. ఆ లోగోను రూపొందించిన సైన్స్ ఉపాధ్యాయుడు దాసరి శివసత్యమూర్తిని అభినందించారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి జి.శ్రీనివాస నెహ్రూ, అర్బన్ రేంజ్ డీఐ బి.దిలీప్ కుమార్, నిర్వాహక కమిటీ సభ్యులు కోలా సత్యనారాయణ, మంగిన శ్రీ రామారావు, ఎస్‌ఎల్‌వీ రమేష్, రమణరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment