మా సామాజిక వర్గానికి అన్యాయం చేస్తే సహించం
ఫ శెట్టిబలిజ నేతల హెచ్చరిక
ఫ జనసేన నాయకులు ల్యాండ్ మాఫియాగా మారారని ఆరోపణ
ఫ ఎమ్మెల్యే స్పందించకపోవడంపై ఆక్షేపణ
ఫ స్థలాల కబ్జా అన్యాయమని ఆవేదన
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): తమ సామాజికవర్గానికి అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని శెట్టిబలిజ సంఘ నేతలు జనసేన నాయకులకు హెచ్చరించారు. తమ సామాజిక వర్గానికి చెందిన గుత్తుల జాన్సన్‌కు చెందిన స్థలాలను జనసేన నాయకులు కబ్జా చేసేందుకు ప్రయత్నించడంపై మండిపడ్డారు. స్థానిక రామారావుపేటలోని శెట్టిబలిజ సంఘ కార్యాలయంలో మంగళవారం వారు విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల్లో జనసేన విజయానికి తాము ఎంతో కృషి చేశామన్నారు. అటువంటిది తమ వారి స్థలాలను కబ్జా చేస్తున్నా జనసేనకు చెందిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడకపోవడం దారుణమని ఆక్షేపించారు. జాన్సన్ భూమి కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్న జనసేన నాయకుడు పుల్ల శ్రీరాములుపై గతంలో రౌడీ షీట్ ఉందని, కూటమి ప్రభుత్వం రాగానే దానిని ఎత్తివేశారని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమ సామాజికవర్గం వారిని టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. పవన్ కల్యాణ్‌పై ఉన్న అభిమానంతో ఆయన బలపర్చిన వ్యక్తులను తాము గెలిపించిన సంగతిని మర్చిపోయారా అని ప్రశ్నించారు. ఆ పార్టీ నాయకులు చేస్తున్న ఘోరాలపై ఆయన స్పందించకపోవడం చూస్తూంటే ఇవన్నీ ఆయనకు తెలిసి జరుగుతున్నాయని తాము అనుకోవాల్సి ఉంటుందని అన్నా రు. శెట్టిబలిజలకు జనసేన పార్టీ కనీసం ఒక్క సీటు, నామినేటెడ్ పోస్టులు ఇవ్వకున్నా తాము పవన్ కల్యాణ్ వెంట నడుస్తున్నామని చెప్పారు. అయినప్ప టికీ తమ సామాజికవర్గీయులపై దాడులు, స్థలాలు కబ్జా చేస్తూంటే ప్రతి దాడులకు తాము కూడా సిద్ధమేనని స్పష్టం చేశారు. అధికారం ఉందని సొంత ప్రయోజనాల కోసం ల్యాండ్ మాఫియాలా తయారైన జనసేన నాయకులు వారి పద్ధతులు మార్చుకోవాలని హితవు పలికారు. సంఘ నాయకుడు చొల్లంగి వేణు గోపాల్ మాట్లాడుతూ, తాము గొడవలు కోరుకోవడం లేదని, జాన్సన్ వద్ద ఆ భూమికి సంబంధించి అన్ని పత్రాలూ ఉన్నాయని అన్నారు. శెట్టిబలిజ జనజాగృతి అధ్యక్షుడు రాయుడు నాగేశ్వరరావు మాట్లాడుతూ, 15 సంవత్సరాలు క్రితం ఇదే స్థలం కోసం గొడవలు జరిగితే తాము వెళ్లి సర్ది చెప్పామన్నారు. ప్రస్తుతం మళ్లీ అదే స్థలం కాజేసేందుకు పుల్ల శ్రీరాము లు రావడం దారుణమని మండిపడ్డారు. జాన్సన్ మాట్లాడుతూ, 2008–09లో తాను సర్పవరంలో స్థలం కొన్నానని చెప్పారు. ఇదే స్థలం విషయంపై తాను 15 సంవత్సరాల క్రితం పుల్ల శ్రీరాములుపై కేసు పెట్టానని చెప్పారు. ప్రస్తుతం జనసేప పార్టీ అండతో ఆయన తనపై దౌర్జన్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment