సర్పవరం స్థల వివాదంపై పుల్ల గోవిందు
కాకినాడ రూరల్: సర్పవరం గ్రామంలోని స్థల వివాదంపై ఆ గ్రామానికి చెందిన పుల్ల గోవిందు, పుల్ల వెంకట రమణ, బత్తుల బాజ్జీ తదితరులు స్పందించారు. సర్పవరం గ్రామంలో వారు మీడియాతో మాట్లాడుతూ, ఈ స్థల వివాదంలో రాజకీయం లేదని, పుల్ల శ్రీరాములు, ఎమ్మెల్యే నానాజీకి సంబంధం లేదని అన్నారు. కోర్టును ఆశ్రయించడంతో 2019లో తమకు అనుకూలంగా తీర్పు వచ్చిందన్నారు. ఆ స్థలం తమ తండ్రి పుల్ల అయ్యన్నకు 1962 నాటి పూర్వార్జితమని, ఆయన కుమారులు గోవిందు, వెంకట రమణ తెలిపారు. ఏపీఐఐసీ భూ సేకరణ అనంతరం 55 సెంట్ల భూమి ఉండటంతో పాస్‌బుక్ కూడా తమకు ఇచ్చారని, దానిలో కుటుంబ అవసరం నిమిత్తం 39 సెంట్లు అమ్ముకున్నామని, మిగిలిన 16 సెంట్లు 111, 112 సర్వే నంబర్లలో ఉందని వివరించారు. దీనిలో వంగతోట వేసుకునేవారన్నారు. తాము రౌడీయిజం చేస్తున్నామనడం సరికాదన్నారు. దౌర్జన్యంగా స్థలంలోకి సోమవారం ప్రవేశించారని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment