పూలదండలు వద్దు.. విద్యాసామగ్రి తీసుకురండి
మాజీ మంత్రి తానేటి వనిత
దేవరపల్లి: యర్నగూడెంలోని తన క్యాంపు కార్యాలయం వద్ద బుధవారం నూతన సంవత్సర వేడుకలు నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర మాజీ హోం మంత్రి తానేటి వనిత తెలిపారు. కార్యాలయం వద్ద ఉదయం నుంచీ నియోజకవర్గ ప్రజలకు, పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉంటామన్నారు. నియోజకవర్గలోని నాలుగు మండలాలకు చెందిన ప్రజలు, వైఎస్సార్ సీపీ శ్రేణులు, అభిమానులు ఈ వేడుకల్లో పాల్గొనా లని ఆమె కోరారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపడానికి వచ్చే ప్రతి ఒక్కరూ పూలదండలు, బొకేలు, శాలువాలు, స్వీట్లు, కేక్‌లు కాకుండా.. నోట్ పుస్తకాలు, పెన్నుల వంటి విద్యా సామగ్రి తీసుకు రావాలని కోరారు. వీటిని పేద విద్యార్థులకు అందించి, వారి ఆనందంలో భాగస్వాములమవుదామని పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలకు, పార్టీ శ్రేణులకు వనిత నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
ఇండియన్ రైఫిల్
షూటింగ్‌కు ఎంపిక
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): గత నెల 26న భోపాల్‌లో నిర్వహించిన 67వ నేషనల్ రైఫిల్ షూటింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో ఆదిత్య విద్యార్థిని పి.సాయి తన్మయి ప్రతిభ చూపి, ఇండియన్ రైఫిల్ షూటింగ్ టీమ్ ట్రైల్స్‌కు అర్హత సా ధించింది. ఈ సందర్భంగా ఆమెను కళాశాలలో ప్రిన్సిపాల్ కరుణ మంగళవారం అభినందించా రు. క్రీడలు శారీరక దృఢత్వంలో పాటు ఉద్యోగావకాశాల్లో రిజర్వేషన్లకు తోడ్పడతాయని, విద్యార్థి దశ నుంచీ క్రీడల్లో నైపుణ్యం సంపాదించుకోవాల ని సూచించారు. సాయి తన్మయిని వైస్ ప్రిన్సిపా ల్ నాగ శ్రీకాంత్, పీడీ సత్యవతి అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment