ఉండ్రాజవరం: పోక్సో కేసులో నేరం రుజువు కావడంతో ఉపాధ్యాయుడికి రెండున్నరేళ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు జడ్జి తీర్పు ఇచ్చినట్లు ఎస్సై గుబ్బల శ్రీనివాసరావు బుధవారం తెలిపారు. ఉండ్రాజవరం ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న డి.గోపాలకృష్ణమూర్తిపై మాగాపు మహలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్సై అవినాష్ 2020లో ఫిబ్రవరి 28న కేసు నమోదు చేశారు. దర్యాప్తు అనంతరం సాక్షులను విచారించిన విచారణ అధికారి పోక్సో కోర్టుకు చార్జ్‌షీట్ దాఖలు చేశారు. సాక్షాధారాలను బట్టి న్యాయమూర్తి ఈ నెల 21న తీర్పును వెలువరించారు. ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా డీవీ రామాంజనేయులు వాదించారు.
Comments
Please login to add a commentAdd a comment