వైభవంగా ముగ్గురు రాజుల పండుగ
ఫిరంగిపురం: మండల కేంద్రంలోని బాల ఏసు దేవాలయంలో ఆదివారం నిర్వహించిన శ్రీసభలో ముగ్గురు రాజులు (జ్ఞానులు) పండుగను వైభవంగా నిర్వహించారు. విచారణ గురువులు మాలపాటి ఫాతిమా మర్రెడ్డి వాక్యోపదేశం చేశారు. మానవులను రక్షించేందుకు భగవంతుడు కన్నె మరియ గర్భాన శిశువు జన్మించేలా చేశాడన్నారు. ఆకాశంలో నక్షత్ర కాంతి ద్వారా ముగ్గురు జ్ఞానులు, గొర్రెల కాపరి, మరికొందరు మాత్రమే శిశువు జన్మించిన ప్రాంతానికి వచ్చి ఆ బాలుడిని చూసి లోకరక్షకుడు జన్మించాడని గుర్తించారన్నారు. అనంతరం ప్రత్యేక దివ్యపూజాబలి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఫాదర్ పి.విలియమ్స్, సహాయ విచారణ గురువు రవీంద్ర, మఠకన్యలు, కథోళిక క్రైస్తవులు, సోడాలిటీ సభ్యులు, గుడి పెద్దలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment